కోకకోలా ఫోన్‌పై క్లారిటీ.. అసలు విషయం ఏంటంటే..
కొన్నిరోజుల క్రితం కోకాకోలా కంపెనీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతున్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.

కోకకోలా ఫోన్‌పై క్లారిటీ.. అసలు విషయం ఏంటంటే..
కొన్నిరోజుల క్రితం కోకాకోలా కంపెనీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతున్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే దానిపై ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చింది. అది రియల్‌మీ కి సంబంధించిన కోకకోలా స్పెషల్ ఎడిషన్ ఫోన్ అని తెలుస్తోంది.
కోకకోలా డిజైన్‌తో ఇంటర్నెట్‌లో కనిపిస్తున్న మొబైల్ కోకకోలా ఫోన్ కాదని, రియల్‌మీ తీసుకొస్తున్న 10ప్రో స్పెషల్ ఎడిషన్ మొబైల్ అని రియల్‌మీ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ నెల 10న రియల్‌మీ 10 ప్రో 5జీ కోకాకోలా ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి రాబోతోంది.
రియల్‌మీ 10 ప్రో 5జీ కోకాకోలా ఎడిషన్‌లో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 13తో పనిచేస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ ఉపయోగించారు. ఇందులో 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ.. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ మొబైల్ ధర రూ. 20 వేల నుంచి రూ. 25 వేల మధ్య ఉండొచ్చు.