Poco X6 Series | 11న భారత్ మార్కెట్లో పొకో ఎక్స్6 ఫోన్ల ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Poco X6 Series | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ పొకో తన మిడ్ రేంజ్ పొకో ఎక్స్ సిరీస్ ఫోన్లను ఈ నెల 11న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Poco X6 Series | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ పొకో తన మిడ్ రేంజ్ పొకో ఎక్స్ సిరీస్ ఫోన్లను ఈ నెల 11న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. పొకో ఎక్స్6 సిరీస్ రెండు వేరియంట్లు.. పొకో ఎక్స్6 (Poxo X6 5G), పొకో ఎక్స్6 ప్రో (Poxo X6 Pro 5G) ఫోన్లు ఉన్నాయి. పొకో ఎక్స్6 ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వస్తుందని భావిస్తున్నారు. రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ఫోన్‌ను రీబ్రాండ్ చేసి పొకో ఎక్స్6 ఫోన్‌గా తీసుకొస్తున్నారని చెబుతున్నారు. 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు 13 మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ లెన్స్ కెమెరా, 2 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
మరోవైపు, పొకో ఎక్స్6 ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ఆల్ట్రా చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రెడ్‌మీ కే70ఈ ఫోన్‌ను రీబ్రాండ్ చేసి ఉంటారని సమాచారం. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌తో వస్తుందని తెలుస్తున్నది. పొకో ఎక్స్6 ఫోన్ 6.67 అంగుళాల అమోలెడ్ 1.5కే ఎల్టీపీఎస్ డిస్‌ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తుందని చెబుతున్నారు.
పొకో ఎక్స్6 ప్రో ఫోన్ 67-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్, 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రావైడ్ లెన్స్, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ కెమెరా ఉంటాయి. 67 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. పొకో ఎక్స్6 మోడల్ ఫోన్ బ్లాక్, గ్రే, ఎల్లో కలర్, పొకో ఎక్స్6 ప్రో మోడల్ ఫోన్ బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే పొకో సిస్టర్ బ్రాండ్ రెడ్‌మీ తన రెడ్‌మీ నోట్13 5జీ ఫోన్ ఈ నెల నాలుగో తేదీన ఆవిష్కరించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నది.