సోలార్ సౌండ్ బాక్స్‌ను లాంచ్ చేసిన పేటీఎం
తక్కువ సూర్యకాంతితో ఛార్జ్ అయ్యేలా వీటిని రూపొందించినట్లు తెలిపిన కంపెనీ

ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం మాతృసంస్థ 'వన్97 కమ్యూనికేషన్స్' .. సోలార్ సౌండ్ బాక్స్‌ను లాంచ్ చేసింది. భారత్‌లో తొలిసారిగా సౌరశక్తితో నడిచే సౌండ్ బాక్స్‌ను తీసుకొచ్చింది. తక్కువ సూర్యకాంతితో ఛార్జ్ అయ్యేలా వీటిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. వ్యాపారాలకు విద్యుత్ ఖర్చుల్ని తగ్గించేందుకు వీటిని అందుబాటులోకి తెచ్చినట్లు పేటీఎం వెల్లడించింద.పేటీఎం సోలార్ సౌండ్ బాక్స్‌లు పైభాగంలో సోలార్ ప్యానెల్‌ను కలిగి ఉంటాయి. ఈ బాక్స్‌ను సూర్యకాంతి తగిలేలా ఉంచితే ఆటోమేటిక్‌గా ఛార్జ్ అవుతుంది. డ్యూయల్ బ్యాటరీతో దీన్ని తీసుకొచ్చారు. ఇందులో ఒక బ్యాటరీ సౌరశక్తితో ఛార్జ్ అయితే, మరొకటి కరెంట్‌తో ఛార్జ్ చేయవచ్చు. సౌరశక్తితో 2-3 గంటలు ఛార్జ్ చేస్తే రోజు మొత్తం పనిచేస్తుందని కంపెనీ చెబుతున్నది. ఇక కరెంట్‌తో ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు వస్తుందని తెలిపింది. 4జీ కనెక్టివిటీకి సపోర్ట్ చేసే ఈ సౌండ్ బాక్స్ 3W స్పీకర్‌తో వస్తున్నది. 11 భాషల్లో ఆడియో నోటిఫికేషన్ సపోర్ట్ చేస్తుంది.