Telugu Global
Science and Technology

Oppo Reno 12 5G Series | ఏఐ ఇంటిగ్రేడెడ్ ఫీచ‌ర్ల‌తో భార‌త్ మార్కెట్‌లో ఒప్పో రెనో12 సిరీస్ ఫోన్ల ఆవిష్క‌ర‌ణ‌.. ధ‌రెంతంటే..?!

Oppo Reno 12 5G Series | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఒప్పో (Oppo) త‌న ప్రీమియం ఫోన్లు ఒప్పో రెనో 12 5జీ (Oppo Reno 12 5G) సిరీస్ ఫోన్ల‌ను భార‌త్ మార్కెట్ల‌లో ఆవిష్క‌రించింది.

Oppo Reno 12 5G Series | ఏఐ ఇంటిగ్రేడెడ్ ఫీచ‌ర్ల‌తో భార‌త్ మార్కెట్‌లో ఒప్పో రెనో12 సిరీస్ ఫోన్ల ఆవిష్క‌ర‌ణ‌.. ధ‌రెంతంటే..?!
X

Oppo Reno 12 5G Series | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఒప్పో (Oppo) త‌న ప్రీమియం ఫోన్లు ఒప్పో రెనో 12 5జీ (Oppo Reno 12 5G) సిరీస్ ఫోన్ల‌ను భార‌త్ మార్కెట్ల‌లో ఆవిష్క‌రించింది. ప‌లు ర‌కాల ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఫీచ‌ర్ల‌తో వ‌చ్చింది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 -ఎన‌ర్జీ (MediaTek Dimensity 7300-Energy) ప్రాసెస‌ర్‌తో ప‌ని చేస్తూ అమోలెడ్ డిస్‌ప్లే క‌లిగి ఉంటాయి.

ఆండ్రాయిడ్ 14 బేస్డ్ క‌ల‌ర్ ఓఎస్ 14.1 ఓఎస్ వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తూ 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్‌వైటీ 600 (Sony LYT600) కెమెరాతో ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తోంది. ఒప్పో రెనో 12 సిరీస్ (Oppo Reno 12) ఫోన్ల‌ను ఇటీవ‌లే చైనాతోపాటు గ్లోబ‌ల్ మార్కెట్ల‌లో ఆవిష్క‌రించింది. ఒప్పో రెనో 12 సిరీస్ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెస‌ర్‌తో గ్లోబ‌ల్ మార్కెట్లో ఎంట‌రైంది. ఒప్పో రెనో 12 ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8250 స్టార్ స్పీడ్ ఎడిష‌న్ ప్రాసెస‌ర్‌, ఒప్పో రెనో 12 ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ స్టార్ స్పీడ్ ఎడిష‌న్ ప్రాసెస‌ర్‌ల‌తో ప‌ని చేస్తుంది.

ఒప్పో రెనో 12 సిరీస్ ఫోన్ల ధ‌ర‌వ‌ర‌లు ఇలా..

ఒప్పో రెనో 12ప్రో 5జీ (Oppo Reno 12 Pro 5G) ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.40,999 ల‌కే సొంతం చేసుకోవ‌చ్చు. ఈ నెల 18 నుంచి ఈ ఫోన్ సేల్స్ ప్రారంభం అవుతాయి. స్పేస్ బ్రౌన్‌, స‌న్‌సెట్ గోల్డ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుందీ ఫోన్‌.

ఒప్పో రెనో 12 5జీ (Oppo Reno 12 5G) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.32,999 ల‌కు కొనుక్కోవ‌చ్చు. ఈ నెల 25 నుంచి భార‌త్ మార్కెట్‌లో సేల్స్ మొద‌ల‌వుతాయి. ఈ ఫోన్ ఆస్ట్రో సిల్వ‌ర్‌, మ్యాట్టే బ్రౌన్‌, స‌న్‌సెట్ పీచ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ఈ ఫోన్ ల‌భిస్తుంది. అటు ఒప్పో రెనో 12 జీ, ఒప్పో రెనో 12 ప్రో 5జీ ఫోన్లు ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌, ఒప్పో ఇండియా వెబ్‌సైట్‌ల‌లో ల‌భిస్తాయి.

ఒప్పో రెనో 12 ప్రో & ఒప్పో రెనో 12 5జీ ఫోన్ల స్పెషికేష‌న్స్‌..

ఒప్పో రెనో 12 ప్రో 5జీ (Oppo Reno 12 Pro 5G), ఒప్పో రెనో 12 5జీ (Oppo Reno 12 5G) ఫోన్లు ఆండ్రాయిడ్ 14 బేస్డ్ క‌ల‌ర్ ఓఎస్ 14.1 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తాయి. మూడేండ్ల పాటు ఓఎస్ అప్‌గ్రేడ్స్‌, నాలుగేండ్లు సెక్యూరిటీ అప్‌గ్రేడ్స్ అందిస్తామ‌ని ఒప్పో (Oppo) ప్ర‌క‌టించింది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 20:9 యాస్పెక్ట్ నిష్ప‌త్తితో 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ + (1,080x2,412 పిక్సెల్స్‌) క్వాడ్ క‌ర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. హెచ్‌డీఆర్ 10+కు మ‌ద్ద‌తుగా ఔట్‌డోర్స్‌లో 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వ‌స్తోంది. ఒప్పో రెనో 12 ప్రో (Oppo Reno 12 Pro) ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్ట‌స్ 2 ప్రొటెక్ష‌న్ (Corning Gorilla Glass Victus 2) , ఒప్పో రెనో 12 (Oppo Reno 12) ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ కోటింగ్ (Corning Gorilla Glass 7i Coating) ప్రొటెక్ష‌న్ క‌లిగి ఉంటుంది.

ఒప్పో రెనో 12 (Oppo Reno 12) సిరీస్ ఫోన్లు ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300-ఎన‌ర్జీ (octa-core MediaTek Dimensity 7300-Energy) ప్రాసెస‌ర్‌తో ప‌నిచేస్తాయి. ఈ ఫోన్లు రెండూ 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ కెపాసిటీ క‌లిగి ఉంటాయి. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వ‌ర‌కూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవ‌చ్చు.

ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్‌తో ఒప్పో రెనో 12 సిరీస్ ఫోన్లు

ఒప్పో రెనో 12 5జీ సిరీస్ ఫోన్లు ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంటాయి. ఒప్పో రెనో 12 ప్రో (Oppo Reno 12 Pro 5G) ఫోన్ ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌) మ‌ద్ద‌తుతో 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సోనీ ఎల్‌వైటీ600 (Sony LYT600) సెన్స‌ర్‌, 8-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 (Sony IMX355) ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 50-మెగా పిక్సెల్ శాంసంగ్ ఎస్‌5కేజేఎన్‌5 (Samsung S5KJN5) టెలిఫోటో సెన్స‌ర్ విత్ 2ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్ క‌లిగి ఉంటుంది. ఇక సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ శాంసంగ్ ఎస్‌5కేజేఎన్‌5 (Samsung S5KJN5) సెన్స‌ర్ కెమెరా ఉంటుంది.

ఒప్పో రెనో 12 5జీ ఫోన్ (Oppo Reno 12 5G) 50- మెగా పిక్సెల్ సోనీ ఎల్‌వైటీ 600 సెన్స‌ర్ (Sony LYT600 sensor) విత్ ఓఐఎస్ ప్రైమ‌రీ కెమెరా, 8- మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్‌355 సెన్స‌ర్ (Sony IMX355 sensor) కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్స‌ర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ సెన్స‌ర్ కెమెరా ఉంటాయి.

ఒప్పో రెనో సిరీస్ ఫోన్ల‌లో ఏఐ ఫీచ‌ర్లు

ఒప్పో రెనో 12 ప్రో 5జీ (Oppo Reno 12 Pro 5G), ఒప్పో రెనో 12 5జీ ఫోన్‌లు ఆర్టిపిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)- ఇంటిగ్రేటెడ్ ఫీచ‌ర్లు ఉన్నాయి. వాటిల్లో ఏఐ స‌మ్మ‌రీ (AI Summary), ఏఐ రికార్డ్ స‌మ్మ‌రీ (AI Record Summary), ఎఐ క్లియ‌ర్ వాయిస్ (AI Clear Voice), ఏఐ రైట‌ర్ (AI Writer), ఏఐ స్పీక్ (AI Speak) వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్ల‌లోని ఏఐ బేస్డ్ కెమెరాల్లో ఏఐ బేస్డ్ ఏఐ బెస్ట్ ఫేస్ (AI Best Face), ఏఐ ఎరేజ‌ర్ 2.0

(AI Eraser 2.0) ఫీచ‌ర్లు ఉన్నాయి. ఈ ఫోన్లు రెండూ 5జీ, బ్లూటూత్ 5.4, ఐఆర్ బ్లాస్ట‌ర్‌, వై-ఫై6 వంటి క‌నెక్టివిటీ ఫీచ‌ర్లతో వ‌స్తున్నాయి. బ‌యో మెట్రిక్ అథంటికేష‌న్ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్‌, ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్‌కు మ‌ద్ద‌తుగా ఉంటుంది. ఈ రెండు ఫోన్ల‌లోనూ 80వాట్ల సూప‌ర్ వూక్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంది. కేవ‌లం 46 నిమిషాల్లో 100 శాతం బ్యాట‌రీ చార్జింగ్ అవుతుంది.

First Published:  13 July 2024 9:53 AM GMT
Next Story