Telugu Global
Science and Technology

ఒప్పో నుంచి డ్యూరబుల్ మొబైల్! కింద పడినా పగలని టెక్నాలజీ!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో నుంచి తాజాగా ఓ బడ్జెట్ మొబైల్ రిలీజ్ అయింది. అత్యంత డ్యూరబుల్ మొబైల్‌గా ఒప్పో దీన్ని ప్రమోట్ చేస్తుంది. ఈ మొబైల్ ధర, స్పెసిఫికేషన్ల వివరాల్లోకి వెళ్తే.

ఒప్పో నుంచి డ్యూరబుల్ మొబైల్! కింద పడినా పగలని టెక్నాలజీ!
X

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో నుంచి తాజాగా ఓ బడ్జెట్ మొబైల్ రిలీజ్ అయింది. అత్యంత డ్యూరబుల్ మొబైల్‌గా ఒప్పో దీన్ని ప్రమోట్ చేస్తుంది. ఈ మొబైల్ ధర, స్పెసిఫికేషన్ల వివరాల్లోకి వెళ్తే.

ఒప్పో నుంచి ‘ఒప్పో కె12ఎక్స్ 5జీ(Oppo K12x 5G)’ పేరుతో రీసెంట్‌గా ఇండియన్ మార్కెట్లో ఓ మొబైల్ లాంఛ్ అయింది. డ్యామేజ్ ప్రూఫ్ ఆర్మర్ బాడీతో ఈ మొబైల్‌ను తయారుచేసినట్టు ఒప్పో సంస్థ ప్రకటించింది. బిల్డింగ్ ఎత్తు నుంచి కింద పడేసినా మొబైల్ తట్టుకోగలదని కంపెనీ చెప్తోంది.

ఒప్పో కె12ఎక్స్ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్ 14పై రన్ అవుతుంది. ఇందులో 6.67-అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్ ప్లే ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుని సపోర్ట్ చేస్తుంది. 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. స్క్రీన్‌కు పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌ ఉంది.

ఒప్పో కె12ఎక్స్ మొబైల్‌లో 32ఎంపీ ప్రైమరీ సెన్సార్‌‌తో పాటు మరో 2 ఎంపీ డెప్త్ సెన్సార్‌ ముందువైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇందులో 45 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఇక డ్యూరబిలిటీ విషయానికొస్తే ఈ మొబైల్‌కు మిలిటరీ-గ్రేడ్ ‘ఎమ్ఐఎల్– ఎస్‌టీడీ-810 హెచ్’ అనే సర్టిఫికేషన్‌ ఉంది. ఈ సర్టిఫికేషన్‌తో వచ్చిన తొలి మొబైల్ ఇదే. ఈ మొబైల్ 360-డిగ్రీల ఆర్మర్ బాడీని కలిగి ఉంటుందట. దీంతోపాటు ముందు వెనుకా పాండా గ్లాస్ ప్రొటెక్షన్, ఐపీ54-రేటింగ్ కూడా ఉన్నాయి. దీంతోపాటు ఈ ఫోన్‌లో 5జీ కనెక్టివిటీ, ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఒప్పో కె12ఎక్స్ 5జీ బేస్ వేరియంట్ (6జీబీ+ 128జీబీ) ధర రూ.12,999 ఉంది. అలాగే 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ. 15,999 ఉంది. బ్రీజ్ బ్లూ, మిడ్‌నైట్ వయొలెట్ కలర్స్‌లో లభిస్తుంది. ఆగస్టు 2 నుంచి సేల్‌కు అందుబాటులో ఉంటుంది.

First Published:  1 Aug 2024 5:37 PM IST
Next Story