Oppo F23 5G | 15న ఒప్పో ఎఫ్23 5జీ ఫోన్ ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Oppo F23 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన `ఒప్పో ఎఫ్23 5జీ (Oppo F23 5G)` ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది.

Oppo F23 5G | 15న ఒప్పో ఎఫ్23 5జీ ఫోన్ ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Oppo F23 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన `ఒప్పో ఎఫ్23 5జీ (Oppo F23 5G)` ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది. బోల్డ్ గోల్డ్ కలర్ షేడ్‌లో వస్తున్న ఒప్పో ఎఫ్23 5జీ (Oppo F23 5G) ఈ నెల 15న భారత్ మార్కెట్‌లోకి రానున్నది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రీ-బుకింగ్స్ చేసుకోవచ్చు. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఇన్ టూ సర్క్యులర్ మాడ్యూల్స్‌లో వస్తుందని భావిస్తున్నారు. బ్యాక్ ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉండవచ్చు. సెల్ఫీల కోసం ఫ్రంట్‌లో పంచ్‌హోల్ కటౌట్ ఉంటుంది.
6.72 ఫుల్ హెచ్‌డీ + డిస్‌ప్లే 120 హెర్జ్ట్ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 67 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ గలిగి ఉంటుంది. 8జీబీ రామ్ విస్తరణ ఫీచర్ కూడా ఉంటుంది. 64-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్, 2-మెగా పిక్సెల్ మొనోక్రోమ్, 2-మెగా పిక్సెల్ మైక్రో లెన్స్ కెమెరా, 32-మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా ఉండొచ్చునని తెలుస్తుంది.
ఒప్పో ఎఫ్23 5జీ ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (2400x1080 పిక్సెల్స్) డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్వోసీ ప్రాసెసర్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 వర్షన్ విత్ 3.5 ఎంఎం ఆడియో జాక్‌పై పని చేస్తుంది. కూల్ బ్లాక్, బోల్డ్ గోల్డ్ కలర్స్‌లో ఫోన్ ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది. ఒప్పో ఎఫ్23 5జీ ఫోన్ ధర రూ.28,999లోపు ఉండొచ్చునని వార్తా కథనాలు చెబుతున్నాయి.