Telugu Global
Science and Technology

Oppo A79 5G | బ‌డ్జెట్ ధ‌ర‌లో ఒప్పో ఏ79 5జీ.. ఆ మూడు ఫోన్ల‌కూ ట‌ఫ్‌ ఫైట్‌.. ఇవీ స్పెషిపికేష‌న్స్‌..!

Oppo A79 5G | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఒప్పో (Oppo) భార‌త్ మార్కెట్‌లోకి త‌న ఒప్పో ఏ79 5జీ (Oppo A79 5G) ఫోన్ ఆవిష్క‌రించింది.

Oppo A79 5G | బ‌డ్జెట్ ధ‌ర‌లో ఒప్పో ఏ79 5జీ.. ఆ మూడు ఫోన్ల‌కూ ట‌ఫ్‌ ఫైట్‌.. ఇవీ స్పెషిపికేష‌న్స్‌..!
X

Oppo A79 5G | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఒప్పో (Oppo) భార‌త్ మార్కెట్‌లోకి త‌న ఒప్పో ఏ79 5జీ (Oppo A79 5G) ఫోన్ ఆవిష్క‌రించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్వోసీ (MediaTek Dimensity 6020) చిప్‌సెట్‌తో వ‌స్తున్న ఒప్పో ఏ79 5జీ ఫోన్ రెండు క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ క‌లిగి ఉంటుంది. ఒప్పో ఏ79 5జీ ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే విత్ సెంట్ర‌ల్లీ లొకేటెడ్ హోల్ పంచ్ క‌టౌట్‌తో వ‌స్తోంది. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే ఒప్పో త‌న ఒప్పో ఏ79 5జీ ఫోన్ (Oppo A79 5G) అందుబాటులోకి తెస్తున్న‌ది.

ఈ మూడు ఫోన్ల‌కు ఒప్పో ఏ79 5జీ ఫోన్ ట‌ఫ్ ఫైట్‌

50-మెగా పిక్సెల్ డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంటుందీ ఒప్పో ఏ79 5జీ (Oppo A79 5G) ఫోన్‌. 33 వాట్ల సూప‌ర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ మద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంది. సింగిల్ చార్జింగ్‌లో 26 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్, 14 గంట‌ల వీడియో ప్లే బ్యాక్ టైం క‌లిగి ఉంటుంది. 30 నిమిషాల్లో 51 శాతం వ‌ర‌కూ చార్జింగ్ అవుతుంది. ఒప్పో ఏ78 5జీ (Oppo A78 5G) ఫోన్‌కు కొన‌సాగింపుగా ఒప్పో ఏ79 5జీ (Oppo A79 5G) ఫోన్ వ‌చ్చింది. ఈ ఫోన్ వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ (OnePlus Nord CE 3 Lite 5G), వివో టీ2 5జీ (Vivo T2 5G), శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ (Samsung Galaxy M34 5G) ఫోన్ల‌కు గ‌ట్టి పోటీ ఇస్తుంద‌ని భావిస్తున్నారు.

ఒప్పో ఏ79 5జీ ఫోన్ ధ‌ర ఇలా

న్యూ ఒప్పో ఏ79 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.19,999ల‌కు ల‌భిస్తుంది. గ్లోయింగ్ గ్రీన్ (Glowing Green), మిస్ట‌రీ బ్లాక్ (Mystery Black) క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో వ‌స్తుంది. ఒప్పో ఈ-స్టోర్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ప్ర‌ధాన రిటైల్ ఔట్‌లెట్ల‌లో ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. శ‌నివారం నుంచి సేల్స్ మొద‌ల‌య్యాయి.

బ్యాంకుల‌పై ఆఫ‌ర్లు ఇలా..

ఎస్బీఐ (SBI), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank), ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్ (IDFC First), ఏయూ ఫైనాన్స్ బ్యాంక్ (AU Finance Bank), వ‌న్ కార్డ్ (One Card), బ్యాంక్ ఆఫ్ బ‌రోడా (Bank of Baroda) కార్డుల‌పై కొనుగోలు చేస్తే రూ.4000 వ‌ర‌కూ డిస్కౌంట్ అందిస్తోంది ఒప్పో. రూ.3,333తో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్ష‌న్ కూడా ఉంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ కింద రూ.4,000 ఎక్స్చేంజ్ బోన‌స్ పొందొచ్చు.

ఇవీ ఒప్పో ఏ79 5జీ స్పెషిఫికేష‌న్స్‌

డ్యుయ‌ల్ సిమ్ (నానో) ఆప్ష‌న్ క‌ల ఒప్పో ఏ79 5జీ (Oppo A79 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్‌ క‌ల‌ర్ ఓఎస్ 13.1 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,080x2,400 పిక్సెల్స్) డిస్‌ప్లే ఎల్‌సీడీ స్క్రీన్ విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ క‌లిగి ఉంటుంది. 650 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. 7 ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్వోసీ చిప్‌సెట్ క‌లిగి ఉంటుంది. 8జీబీ ర్యామ్‌తో వ‌స్తున్న ఈ ఫోన్‌లో వ‌ర్చువ‌ల్‌గా 16 జీబీ ర్యామ్ వ‌ర‌కూ పొడిగించుకోవ‌చ్చు.

డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్‌తో ఒప్పో ఏ79 5జీ

ఒప్పో ఏ79 5జీ ఫోన్ డ్యుయ‌ల్ రేర్ కెమెరా క‌లిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ విత్ ఎఫ్‌/1.8 అపెర్చ‌ర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్స‌ర్ విత్ ఎఫ్‌/2.4 అపెర్చ‌ర్ లెన్స్ కెమెరా ఉంటాయి. ఇక సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8- మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ విత్ ఎఫ్‌/2.0 అపెర్చ‌ర్ లెన్స్ కెమెరా కూడా ఉంటుంది.

ఒప్పో ఏ79 5జీ క‌నెక్టివిటీ ఇలా

ఒప్పో ఏ79 5జీ (Oppo A79 5G) ఫోన్ వై-ఫై, బ్లూటూత్ 5.3, 3.5 ఎంఎం ఆడియో జాక్‌, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్‌, యూఎస్బీ ఓటీజీ, జీపీఎస్‌, ఏ-జీపీఎస్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది. యాక్సెలెరోమీట‌ర్‌, ఆంబియెంట్ లైట్ సెన్స‌ర్‌, జియో మ్యాగ్న‌టిక్ సెన్స‌ర్‌, గ్రావిటీ సెన్స‌ర్‌, పెడో మీట‌ర్‌, ప్రాగ్జిమిటీ సెన్స‌ర్ క‌లిగి ఉంటాయి. బ‌యో అథంటికేష‌న్ కోసం ఇన్‌-డిస్ ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్‌, ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్ ఉంటాయి.

First Published:  28 Oct 2023 1:56 PM IST
Next Story