Telugu Global
Science and Technology

Oppo A60 | ఒప్పో నుంచి ఎంట్రీ లెవ‌ల్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఏ60.. త్వ‌ర‌లో భార‌త్‌లో ఆవిష్క‌ర‌ణ‌..?!

Oppo A60 | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఒప్పో (Oppo) త‌న ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్ల‌లో తాజా ఎంట్రీ లెవ‌ల్ ఫోన్ ఒప్పో ఏ60 ఫోన్ (Oppo A60) ను వియ‌త్నాంలో ఆవిష్క‌రించింది.

Oppo A60 | ఒప్పో నుంచి ఎంట్రీ లెవ‌ల్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఏ60.. త్వ‌ర‌లో భార‌త్‌లో ఆవిష్క‌ర‌ణ‌..?!
X

Oppo A60 | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఒప్పో (Oppo) త‌న ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్ల‌లో తాజా ఎంట్రీ లెవ‌ల్ ఫోన్ ఒప్పో ఏ60 ఫోన్ (Oppo A60) ను వియ‌త్నాంలో ఆవిష్క‌రించింది. ఒప్పో ఏ60 పేరుతో ఆవిష్కృత‌మైన ఈ ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్‌రేటుతోపాటు 6.67-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే స్క్రీన్ క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 680 చిప్ (Qualcomm's Snapdragon 680 chip) విత్ 8జీబీ ర్యామ్ అండ్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌గా వ‌స్తోంది. 45 వాట్ల సూప‌ర్ వూక్ చార్జ‌ర్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ క‌లిగి ఉంటుంది. అయితే, భార‌త్ మార్కెట్లో ఎప్పుడు ఆవిష్క‌రిస్తామ‌న్న సంగ‌తి వెల్ల‌డించ‌లేదు. డ్యుయ‌ల్ రేర్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

ఒప్పో ఏ60 (Oppo A60 ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.18,060 ప‌లుకుతుంటే, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.21,360 ప‌లుకుతుంది. మిడ్‌నైట్ ప‌ర్పులు, రిపిల్ బ్లూ క‌ల‌ర్‌వేస్‌లో ల‌భిస్తుందీ ఫోన్‌. ఒప్పో ఏ60 (Oppo A60) ఫోన్- ఆండ్రాయిడ్‌-14 బేస్డ్ క‌ల‌ర్ ఓఎస్ 14.0.1 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.67-అంగుళాల హెచ్‌డీ+ (720x1,604 పిక్సెల్స్‌) ఎల్‌సీడీ స్క్రీన్‌తో వ‌స్తుంది. ఒక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ LCD చిప్‌సెట్ క‌లిగి ఉంటుంది.

ఒప్పో ఏ60 (Oppo A60) ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా విత్ ఎఫ్‌/1.8 అపెర్చ‌ర్ అండ్ ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌), డెప్త్ డేటా సేక‌ర‌ణ కోసం అన్ స్పెసిఫైడ్ 2-మెగా పిక్సెల్ సెకండ‌రీ కెమెరా విత్ ఎఫ్‌/2.4 అపెర్చ‌ర్ ఉంటాయి. ఇక సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ సెన్స‌ర్ ఫ్రంట్ కెమెరా ఉంట‌ది. సెంట‌ర్ అలైన్డ్ హోల్ పంచ్ క‌టౌట్ ఉంట‌ది. 4జీ ఎల్‌టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్‌, యూఎస్బీ టైప్ సీ పోర్ట్‌, 3.5 ఎంఎం ఆడియో జాక్ క‌నెక్టివిటీ ఉంటుంది. మ్యాగ్నెటో మీట‌ర్‌, యాక్సిల‌రో మీట‌ర్‌, లైట్ సెన్స‌ర్‌, ప్రాగ్జిమిటీ సెన్స‌ర్ ఉంటాయి. బ‌యో మెట్రిక్ అథంటికేస‌న్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ ఉంటుంది. 45వాట్ల చార్జింగ్ మ‌ద్ద‌తుతో ఒప్పో ఏ60 ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంది.

First Published:  29 April 2024 11:00 AM IST
Next Story