Telugu Global
Science and Technology

OnePlus Nord 3 | జూలై 5న భార‌త్ మార్కెట్లోకి వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 3.. నార్డ్ సీఈ3.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

OnePlus Nord 3 | చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వ‌న్ ప్ల‌స్‌, భార‌త్ మార్కెట్లోకి వ‌న్‌ప్ల‌స్ నార్డ్3, వ‌న్ ప్ల‌స్ నార్డ్ 3 ప్ల‌స్ ఫోన్ల‌తోపాటు నార్డ్ బ‌డ్స్ 2ఆర్ తీసుకురానున్న‌ది.

OnePlus Nord 3 | జూలై 5న భార‌త్ మార్కెట్లోకి వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 3.. నార్డ్ సీఈ3.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!
X

OnePlus Nord 3 | జూలై 5న భార‌త్ మార్కెట్లోకి వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 3.. నార్డ్ సీఈ3.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

OnePlus Nord 3 | చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వ‌న్ ప్ల‌స్‌, భార‌త్ మార్కెట్లోకి వ‌న్‌ప్ల‌స్ నార్డ్3, వ‌న్ ప్ల‌స్ నార్డ్ 3 ప్ల‌స్ ఫోన్ల‌తోపాటు నార్డ్ బ‌డ్స్ 2ఆర్ తీసుకురానున్న‌ది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. వ‌చ్చేనెల ఐదో తేదీ సాయంత్రం ఏడు గంట‌ల‌కు వ‌న్ ప్ల‌స్ నార్డ్ 3 5జీ ఫోన్ మార్కెట్లో ఆవిష్క‌రిస్తున్న‌ట్లు వ‌న్ ప్ల‌స్ ధృవీక‌రించింది. వ‌న్ ప్ల‌స్ నార్డ్‌3 ఫోన్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తున్న‌ది. 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్‌, 8-మెగా పిక్సెల్ సెన్స‌ర్, 2-మెగా పిక్సెల్ సెన్స‌ర్‌, సెల్ఫీలు, వీడియోల కోసం 16-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది.

అల‌ర్ట్ స్లైడ‌ర్‌తో ఫ్లాట్ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. రెండు క‌ల‌ర్ ఆప్ష‌న్స్ - టెంప్టెస్ట్ గ్రే, మిస్టీ గ్రీన్ రంగుల్లో ల‌భిస్తుంది. హ్యాండ్ సెట్ అక్వా స‌ర్జ్ క‌ల‌ర్‌వేలో ఉంటుంది. ఈ నెల 28న మ‌రికొన్ని డిటైల్స్ తెలుస్తాయ‌ని వ‌న్‌ప్ల‌స్ వెబ్ సైట్ తెలిపింది. 6.7 -అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే విత్ రీఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ , 950 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ క‌లిగి ఉంటుంది.ఐఆర్ బ్లాస్ట‌ర్‌, ఎన్ఎఫ్‌సీ క‌నెక్టివిటీకి స‌పోర్ట్‌గా ఉంటుంద‌ని భావిస్తున్నారు. డోల్బీ ఆట్మోస్ స‌పోర్టెడ్ డ్యుయ‌ల్ స్పీక‌ర్స్ ఉన్నాయి.

భార‌త్‌లో వ‌న్‌ప్ల‌స్ 5జీ ఫోన్ 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.32,999తో మొద‌ల‌తుంద‌ని తెలుస్తున్న‌ది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ఎస్వోసీ చిప్‌సెట్ క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ విత్ 80 వాట్ల సూప‌ర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ఉంటుంది.

నార్డ్ సీఈ 3 ఇలా

వ‌న్ ప్ల‌స్ నార్డ్ ఎస్ఈ 3 ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 782 ఎస్వోసీ చిప్ సెట్‌, 12 జీబీ ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ రామ్ క‌లిగి ఉంటుంది. దీన్ని వ‌ర్చువ‌ల్‌గా 16 జబీ రామ్ వ‌ర‌కు విస్తరించ‌వ‌చ్చు. ఆండ్రాయిడ్ 13 విత్ ఆక్సిజ‌న్ ఓఎస్ 13.1 వ‌ర్ష‌న్ మీద ప‌ని చేస్తుంది. రెండేండ్ల వ‌ర‌కు ఆండ్రాయిడ్ అప్ డేట్స్‌, మూడేండ్ల వ‌ర‌కు సెక్యూరిటీ అప్‌డేట్స్ అంద‌జేస్తుంది. ఆక్వా స‌ర్జ్‌, గ్రే షిమ్మ‌ర్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది.

వ‌న్ ప్ల‌స్ నార్డ్ సీఈ 3 ఫోన్ కూడా ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తుంది. 50-మెగా పిక్సెల్ ఐఎంఎక్స్ 890 ప్రైమ‌రీ సెన్స‌ర్ విత్ ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌), 8-మెగా పిక్సెల్ సెన్స‌ర్ విత్ 112 డిగ్రీల ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌, 2-మెగా పిక్సెల్ సెన్స‌ర్ విత్ 4 సీఎం మాక్రో లెన్స్ కెమెరాలు ఉన్నాయి. 30ఎఫ్‌పీఎస్ వ‌ద్ద 4కేలో వీడియోలు రికార్డు చేయ‌డానికి ట‌ర్బో రా క్వాలిటీకి కెమెరా యూనిట్ స‌పోర్ట్‌గా ఉంటుంది. సెల్ఫీ కెమెరా వివ‌రాలు వెల్ల‌డి కాలేదు. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ విత్ 80 వాట్ల సూప‌ర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది.

First Published:  27 Jun 2023 12:31 PM IST
Next Story