OnePlus 12 - OnePlus 12R | భారత్ మార్కెట్‌లోకి వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు వన్‌ప్లస్12 అండ్ వన్‌ప్లస్12 ఆర్.. ఇవీ స్పెషిపికేషన్స్..!
OnePlus 12 - OnePlus 12R | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) తన ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 12 సిరీస్ (OnePlus 12 Series) ఫోన్లను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.
OnePlus 12-OnePlus 12R | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) తన ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 12 సిరీస్ (OnePlus 12 Series) ఫోన్లను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ (Qualcomm's Snapdragon 8 Gen 3 chip) తో వచ్చింది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా సోనీ ఎల్‌వైటీ -808 (Sony LYT-808) సెన్సర్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 64-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. వన్‌ప్లస్12 తోపాటు వన్‌ప్లస్ 12 ఆర్ (OnePlus 12R) ఫోన్ కూడా వస్తుంది. వన్‌ప్లస్ ఏస్3 ఫోన్‌ను రీబ్రాండ్ చేసి వన్‌ప్లస్ 12ఆర్ (OnePlus 12R) మార్కెట్‌లోకి తెచ్చింది. రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 14 ఔటాఫ్ బాక్స్ (Android 14-based OxygenOS 14 out-of-the-box) వర్షన్‌పై పని చేస్తాయి.
వన్‌ప్లస్12.. వన్‌ప్లస్ 12ఆర్ ధరలు ఇలా
వన్‌ప్లస్ 12 ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.64,999, 16జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.69,999లకు లభిస్తుంది. వన్‌ప్లస్ 12 ఫోన్ ఫ్లవీ ఎమరాల్డ్, సిల్కీ బ్లాక్ కలర్ వేస్‌లో పని చేస్తుంది. ఈ నెల 30 నుంచి వన్‌ప్లస్ వెబ్‌సైట్, అమెజాన్, ఇతర రిటైల్ స్టోర్లలో లభిస్తుంది.
మరోవైపు వన్‌ప్లస్ 12 ఆర్ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.39,999, 16 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.45,999లకు లభిస్తుంది. ఈ ఫోన్ కూల్ బ్లూ, ఐరన్ గ్రే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి వన్‌ప్లస్ వెబ్‌సైట్, ఇతర రిటైల్ స్టోర్లలో సేల్స్ ప్రారంభం అవుతాయి.
ఇవీ వన్‌ప్లస్ 12 స్పెషిఫికేషన్స్
వన్‌ప్లస్ 12 ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్14 వర్షన్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్ 6.82- అంగుళాల క్వాడ్ - హెచ్‌డీ+ (1,440 x 3,168 పిక్సెల్స్) ఎల్‌టీపీఓ 4.0 అమోలెడ్ స్క్రీన్ విత్ గొరిల్లా గ్లాస్ విక్టస్-2 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో డిస్‌ప్లే ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తున్నది.
హ్యాసిల్‌బ్లాడ్ ట్యూన్‌తో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ సోనీ ఎల్‌వైటీ808 సెన్సర్ అండ్ ఎఫ్/1.6 అపెర్చర్, 48-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా విత్ 114- డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, 64-మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా విత్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ అండ్ ఎఫ్/2.6 అపెర్చర్ ఉంటాయి. సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరాతో వస్తుంది.
ఇలా వన్‌ప్లస్12 కనెక్టివిటీ
వన్‌ప్లస్12 ఫోన్ 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. వీటితోపాటు గైరోస్కోప్, యాక్సెలరో మీటర్, మాగ్నెటో మీటర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, 100వాట్ల సూపర్ వూక్ చార్జర్, 50వాట్ల వైర్‌లెస్, 10 వాట్ల రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్ మద్దతుతో 5400 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.
వన్‌ప్లస్ 12ఆర్ స్పెషిఫికేషన్స్ ఇలా
వన్‌ప్లస్ 12 ఆర్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 14 ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్ 6.78 అంగుళాల 1.5 కే (1,264x2,780 పిక్సెల్స్) ఎల్‌టీపీఓ 4.0 అమోలెడ్ స్క్రీన్ ఉంటుంది. వన్‌ప్లస్12లో మాదిరిగానే రీఫ్రెష్ రేట్, డిస్‌ప్లే ప్రొటెక్షన్ ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో పని చేస్తుంది. 50-మెగా పిక్సెల్ కెమెరా విత్ సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సర్ అండ్ ఎఫ్/1.8 అపెర్చర్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా విత్ 112 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా విత్ ఎఫ్/2.4 అపెర్చర్ ఉంటాయి. సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా విత్ ఎఫ్/2.4 అపెర్చర్ ఉంటాయి. బ్లూటూత్ 5.3 మినహా వన్‌ప్లస్ 12 ఫోన్‌లో మాదిరిగి కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. వన్‌ప్లస్ 12 ఆర్ ఫోన్ 100వాట్ల సూపర్ వూక్ వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.