Telugu Global
Science and Technology

నథింగ్ సీఎంఎఫ్ ఫోన్ రిలీజ్! స్పెషల్ ఫీచర్లివే..

ప్రముఖ మొబైల్ బ్రాండ్ నథింగ్‌.. తమ సబ్‌బ్రాండ్ అయిన సీఎంఎఫ్‌ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. ఈ మొబైల్ ధర, ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే..

నథింగ్ సీఎంఎఫ్ ఫోన్ రిలీజ్! స్పెషల్ ఫీచర్లివే..
X

ప్రముఖ మొబైల్ బ్రాండ్ నథింగ్‌.. తమ సబ్‌బ్రాండ్ అయిన సీఎంఎఫ్‌ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. ఈ మొబైల్ ధర, ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే..

నథింగ్ నుంచి ‘సీఎంఎఫ్‌ ఫోన్‌1(CMF Phone1)’ పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ మొబైల్ లాంఛ్ అయింది. ఈ మొబైల్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 బేస్డ్ నథింగ్‌ 2.6 ఓఎస్‌పై రన్ అవుతుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌టీపీఎస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120హెర్ట్జ్ రీఫ్రెష్‌ రేటుని సపోర్ట్ చేస్తుంది. 2000 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది.

నథింగ్ సీఎంఎఫ్‌ ఫోన్‌1 కెమెరాల విషయానికొస్తే.. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు మరో డెప్త్‌ సెన్సర్‌, ముందువైపు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 33వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఇకపోతే నథింగ్ సీఎంఎఫ్‌ ఫోన్‌1లో ఐపీ52 స్ల్పాష్‌ అండ్ డస్ట్‌ ప్రూఫ్ రేటింగ్‌, ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌, వైఫై 6, బ్లూటూత్‌ 5.3, ఎన్ఎఫ్ సీ కనెక్టివిటీ, డ్యుయల్ నానో సిమ్, యూఎఫ్ ఎస్ 2.2 స్టోరేజ్, ఓటీజీ సపోర్ట్ వంటి ఫీచర్లున్నాయి. సాఫ్ట్ వేర్ కు రెండేళ్ల వరకూ అప్‌డేట్స్, మూడేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వనున్నట్టు కంపెనీ తెలిపింది.

నథింగ్ సీఎంఎఫ్‌ ఫోన్‌ 1 సరికొత్త డిజైన్‌తో ఉంటుంది. మొబైల్ బేస్ వేరియంట్ (6జీబీ+ 128జీబీ) ధర రూ.15,999, 8జీబీ ర్యామ్‌ + 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా కొన్ని బ్యాంకు కార్డులపై డిస్కౌంట్స్ ఉన్నాయి. బ్లాక్, ఆరెంజ్‌, లైట్‌ గ్రీన్‌, బ్లూ కలర్స్‌లో లభిస్తుంది.

First Published:  9 July 2024 11:02 AM GMT
Next Story