Amazon Palm Payments | ఇక క్యాష్.. కార్డు అక్కర్లేదు.. అరచేయి స్కానింగ్‌తో పేమెంట్స్ చాలా ఈజీ !
Amazon Palm Payments | బయోమెట్రిక్ టెక్నాలజీతో `అరచేతి`తో పేమెంట్స్ చేసేయొచ్చు. గ్లోబల్ ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ ఈ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చింది.

Amazon Palm Payments | ఇక క్యాష్.. కార్డు అక్కర్లేదు.. అరచేయి స్కానింగ్‌తో పేమెంట్స్ చాలా ఈజీ !
Amazon Palm Payments | గతంలో సరుకుల దుకాణానికి వెళ్లినా.. సినిమాకెళ్లినా.. బస్సు లేదా రైలు ప్రయాణం చేసినా అన్నీ క్యాష్ పేమెంట్లే. డబ్బు విత్ డ్రాయల్స్‌కు గానీ, డిపాజిట్ గానీ చేయాలంటే ఆయా బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా కొద్దీ మనీ చెల్లింపుల విధానంలో మార్పులొచ్చాయి. బ్యాంక్ అకౌంట్ ఆధారిత డెబిట్ కార్డుతో ఏటీఎం సెంటర్‌కెళ్లి మనీ విత్ డ్రా చేసుకునే వాళ్లం..
క్రమేణా అదే ఏటీఎం సెంటర్‌లో మనీ డిపాజిట్లు.. తర్వాత యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ పేస్ (యూపీఐ) పేమెంట్స్ వచ్చాయి.. అంటే ఇప్పుడు మొబైల్ ఆధారిత యాప్స్... ఫోన్‌పే, జీ-పే, పేటీఎం, భారత్ పే, అమెజాన్ పే తదితర యాప్స్‌తో క్షణాల్లో పేమెంట్స్ జరిగిపోతున్నాయి. ఇక ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆర్టీజీఎస్ పేమెంట్స్ కూడా జరిగేవి.. కానీ మున్ముందు గ్రాసరీ షాపుకెళితే క్యాష్ వాలెట్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.. డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు తీసుకెళ్లాల్సిన పని లేదు.
ఇప్పుడు మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆధార్ కార్డు ఆధారంగా సామాజిక సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) విధానం ఉందిగా.. అలా.. బయోమెట్రిక్ టెక్నాలజీతో `అరచేతి`తో పేమెంట్స్ చేసేయొచ్చు. గ్లోబల్ ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ ఈ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చింది.
అమెజాన్ వన్` పామ్ పేమెంట్ (Amazon One's Palm Payment)తో ఏం చక్కా చెల్లింపులు చేసేయొచ్చు. ఆయా గ్రాసరీ స్టోర్లు, హోటల్స్, ఫుడ్ కోర్టులు, ఇతర ప్రదేశాల్లో మనక్కావాల్సింది మనం కొనుక్కున్నాక.. పేమెంట్స్ సెక్షన్ దగ్గర `స్కానింగ్` డివైజ్ మీద అరచేయి స్కాన్ చేస్తే చాలు పేమెంట్స్ జరిగిపోతాయి. అయితే ముందుగా మనం మన అరచేయి (Palm)ని స్కాన్ చేసి, దాన్ని మన క్రెడిట్ కార్డుతో లింక్ చేయాలి. ఈ పని చేస్తే తర్వాత కియోస్క్ మీద అరచేతిని ఊపినా చెల్లింపులు జరిగిపోతాయి.
ప్రారంభంలో అమెజాన్ వన్.. తన గో క్యాషియర్ లెస్ స్టోర్లలో ఈ విధానాన్ని అమలు చేసింది. తదుపరి హోల్ ఫుడ్ సూపర్ మార్కెట్లలో ఈ టెక్నాలజీ (Palm Reading Payment Technology)ని వినియోగిస్తున్నది. ప్రస్తుతం మన భారత్‌లో ఈ పథకం అమల్లోకి రాలేదు. అమెరికాలో తొలుత ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం అమెరికాలోని 200 హోల్ ఫుడ్ సూపర్ మార్కెట్లలో అరచేయి స్కానింగ్ చెల్లింపుల టెక్నాలజీ (Palm Reading Payment Technology) చెల్లింపు పాలసీ అమలవుతున్నది. ఈ ఏడాది చివరి వరకు దాదాపు 500 స్టోర్లకు విస్తరించాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకున్నది.
అరచేయి స్కానింగ్ చెల్లింపుల టెక్నాలజీ (Palm Reading Payment Technology) కేవలం గ్రాసరీ స్టోర్లకు మాత్రమే పరిమితం కాలేదు. స్టేడియాలు, ఎంటర్‌టైన్‌మెంట్ వేదికలతోపాటు అమెరికాలోని పలు విమానాశ్రయాల వద్ద హుడ్సన్, క్రూస్, ఓహెచ్ఎం వేదికల వద్ద అమెజాన్ వన్ టెక్నాలజీ వినియోగిస్తోంది.
అడ్వాన్స్‌డ్ ఇమేజింగ్ అండ్ కంప్యూటర్ విజన్ అల్గోరిథమ్స్‌తో మీ అరచేతి ఇమేజ్‌ని అమెజాన్ వన్ క్షణాల్లో క్యాప్చర్ చేసేస్తుంది. ఇది మీ పర్సనలైజ్డ్ పామ్ సిగ్నేచర్‌ను క్రియేట్ చేస్తుంది. షాపింగ్ చేసిన ప్రతి సారీ `అమెజాన్ వన్` ద్వారా పేమెంట్స్ చేసేయవచ్చు. మీ పర్సనలైజ్డ్ పామ్ సిగ్నేచర్‌ను ఇతర సున్నితమైన మీ పర్సనల్ డేటాతోపాటు సురక్షితంగా దాచి ఉంచుతుంది అమెజాన్. ఈ డేటా ఎల్లవేళలా సురక్షితం అని, ఏ డివైజ్‌లోనూ స్టోర్ చేయబోరని అమెజాన్ హామీ ఇస్తోంది.