Telugu Global
Science and Technology

నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ రిలీజ్!

నథింగ్ కంపెనీ ఇండియన్ యూజర్ల కోసం ఓ స్పెషల్ ఎడిషన్ ఫోన్‌ను రిలీజ్ చేసింది.

నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ రిలీజ్!
X

నథింగ్ కంపెనీ ఇండియన్ యూజర్ల కోసం ఓ స్పెషల్ ఎడిషన్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. రిలీజ్ అయినప్పుడు కేవంల బ్లాక్, వైట్ రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉన్న నథింగ్ ఫోన్ 2ఎ ఇప్పుడు బ్లూ షేడ్‌లో కూడా అందుబాటులో ఉంది. అంతేకాదు ఇండియన్ యూజర్లకోసం ఇతర కలర్ వేరియంట్స్‌ను కూడా తీసుకొస్తామని నథింగ్ చెప్తోంది.

నథింగ్ ఫోన్ 2ఎ లో డిఫరెంట్ కలర్ ఆప్షన్లు కావాలని ఇండియన్ యూజర్లు నథింగ్‌ను కోరడంతో ఎట్టకేలకు నథింగ్ ఓ స్పెషల్ ఎడిషన్‌ను లాంఛ్ చేసింది. ఈ సరికొత్త బ్లూ ఎడిషన్ ఫోన్.. మే 2 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ఆఫర్లతో కలిపి దీని ధర రూ. 19,999 ఉంటుంది.

నథింగ్ బ్రాండ్.. మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో తీసుకొచ్చిన నథింగ్ ఫోన్ 2ఎ.. ప్రస్తుతం బాగా అమ్ముడవుతోంది. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇది మీడియాటెక్‌ డైమెన్సిటీ 7,200 ప్రో ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 బేస్డ్ నథింగ్‌ 2.5 ఓఎస్‌పై రన్ అవుతుంది. ఇందులో 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120 రీఫ్రెష్‌ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 1300 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

నథింగ్ ఫోన్ 2ఎ లో 50ఎంపీ మెయిన్‌ కెమెరాతో పాటు 50ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరా 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇందులో ఉండే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ.. 45వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తుంది. బ్లూటూత్‌ 5.3, వైఫై 6, ఎన్‌ఎఫ్‌సీ, గిఫ్ ఇంటర్ఫేస్ వంటి ఫీచర్లున్నాయి.

నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ 8జీబీ+12జీబీ ర్యామ్‌, 128 జీబీ+ 256జీబీ స్టోరేజ్‌ ఆప్షన్స్‌తో వస్తోంది. 8జీబీ + 128జీబీ వేరియంట్‌ ధర రూ.23,999, 8జీబీ + 256జీబీ ధర రూ.25,999, 12జీబీ + 256జీబీ వేరియంట్‌ ధర రూ.27,999గా ఉన్నాయి. బ్యాంక్‌ కార్డు ఆఫర్లు, ఈఎంఐ డిస్కౌంట్లు ఉన్నాయి.

First Published:  1 May 2024 12:30 AM GMT
Next Story