భవిష్యత్తులో డ్రోన్‌లతోనే యుద్ధాలు
డ్రోన్‌ల వినయోగ కాలంలో మావన సహిత ఫైటర్ జెట్‌లను వాడటం లేదన్న మస్క్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కాబోయే అధ్యక్షుడు తన ప్రభుత్వంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలను డోజ్ సంయుక్త సారథులుగా నియమించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి మస్క్ పలు సూచనలు చేశాడు. ఆధునిక ఫైటర్ జెట్‌ల కంటే డ్రోన్‌ల వల్లనే ఎక్కువ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో యుద్ధాలు డ్రోన్‌లతోనే జరుగుతాయన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
డ్రోన్‌ల వినయోగ కాలంలో మావన సహిత ఫైటర్ జెట్‌లను వాడటం లేదు. ఎందుకంటే అవి పైలట్‌లను చంపేస్తున్నాయి. అయినా ఇంఆక కొంతమంది ఎఫ్-35(F-35 Fighter Jet) వంటి మనుషులు నడిపే యుద్ధ విమానాలను తయారు చేస్తున్నారు. అయితే ఆ డిజైన్‌లు నేటి అవసరాలకు అనుగుణంగా లేవని మస్క్ రాసుకొచ్చారు
ఎఫ్-35 ఫైటర్ జెట్‌లు ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమానాలు. దీనిలో అధునాతన ఫీచర్లు, రాడార్ గుర్తించకుండా ఉండే వ్యవస్థలున్నాయి. అయితే ఈ ఫైటర్ జెట్ పలు టెక్నికల్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు రూపకల్పనలో, దాని నిర్వహణ ఖర్చుల వంటి విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలోనే మస్క్ ఎఫ్-35 ఫైటర్ జెట్లను వ్యతిరేకిస్తూ మస్క్ పెట్టడం విశేషం.