మోటొరోలా నుంచి ఫోల్డబుల్ ఫోన్! ఫీచర్లివే..
మోటోరొలా బ్రాండ్.. మోటో రేజర్ 50 పేరుతో సరికొత్త ఫోల్డబుల్ ఫోన్స్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో రేజర్ 50, రేజర్ 50 అల్ట్రా అను రెండు ఫోన్లు ఉండబోతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ ఫీచర్లు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటొరోలా నుంచి సరికొత్త ఫోల్డబుల్ ఫోన్స్ రాబోతున్నాయి. ఈ ఫోన్ ఫీచర్లు, ఇతర వివరాల్లోకి వెళ్తే..
మోటోరొలా బ్రాండ్.. మోటో రేజర్ 50 పేరుతో సరికొత్త ఫోల్డబుల్ ఫోన్స్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో రేజర్ 50, రేజర్ 50 అల్ట్రా అను రెండు ఫోన్లు ఉండబోతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ ఫీచర్లు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
మోటో రేజర్ 50 ఫోన్లు పెద్ద కవర్ డిస్‌ప్లేతో, కర్వ్‌డ్ స్క్రీన్‌తో రానున్నాయి. రేజర్ 50 ఫోన్ లో 3.3-అంగుళాల కవర్ డిస్‌ప్లేతో పాటు 6.9-అంగుళాల పీఓఎల్ఈడీ మెయిన్ స్క్రీన్ ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది.
మోటొరోలా రేజర్ 50 మొబైల్.. మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఓఎస్‌పై రన్ అవుతుంది. ఇక కెమెరాల విషయానికొస్తే.. ఇందులో కవర్ స్క్రీన్‌పై 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 13ఎంపీ సెకండరీ కెమెరాతో పాటు మెయిన్ స్క్రీన్‌పై 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. ఈ మొబైల్‌లో 4200ఎంఎహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
ఇక మోటో రేజర్ 50 అల్ట్రా విషయానికొస్తే.. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఇందులో 4 అంగుళాల కవర్ డిస్‌ప్లే, 6.9 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే ఉంటుంది. రెండు 50 ఎంపీ కవర్ స్క్రీన్ కెమరాలు, ఒక 32 ఎంపీ మెయిన్ స్క్రీన్ కెమెరా ఉంటుంది. ఈ రెండు ఫొన్లు జూన్ నెలలో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది.