మోటో జీ64 5జీ! బడ్జెట్ తక్కువే.. ఫీచర్లు ఓకే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా నుంచి రీసెంట్‌గా ‘మోటో జీ64 5జీ’ మొబైల్ రిలీజ్ అయింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ మొబైల్ ఆకట్టుకుంటోంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా నుంచి రీసెంట్‌గా ‘మోటో జీ64 5జీ’ మొబైల్ రిలీజ్ అయింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ మొబైల్ ఆకట్టుకుంటోంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..
మోటో జీ62 ఫోన్‌కు కొనసాగింపుగా మోటో జీ64 5జీ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అయింది. రూ. 15,000 బడ్జెట్‌లో మంచి బ్యాటరీ, కెమెరా, కొత్త ప్రాసెసర్ దీని ప్రత్యేకతలు.
మోటో జీ62 5జీ.. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌తో వస్తున్న మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే. ఇది ఆండ్రాయిడ్ 14 బేస్డ్ మైయూఎక్స్ యూఐపై రన్ అవుతుంది.
మోటో జీ64 5జీ కెమెరాల విషయానికొస్తే ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఫేస్ డిటెక్షన్ ఫీచర్స్ కలిగిన 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు వెనుక 8 -మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ సెన్సర్, సెల్ఫీల కోసం 16-మెగా పిక్సెల్ ఫ్రంట్ సెన్సర్ ఉన్నాయి.
ఈ మొబైల్ లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుని సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ.. 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. మైక్రో ఎస్‌డీ సపోర్ట్, 5జీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, ఐపీ 52 డస్ట్ ప్రూఫ్, గొరిల్లా గ్లాస్ 3, డాల్బీ అట్మాస్ స్పీకర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మోటో జీ64 5జీ.. 8 జీబీ+ 128 జీబీ వేరియంట్ ధర రూ.14,999, 12 జీబీ+ 256 జీబీ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది. ఐస్ లైలాక్, మింట్ గ్రీన్, పెరల్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.