Motorola Edge 50 Fusion | భారత్ మార్కెట్‌లో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూషన్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Motorola Edge 50 Fusion | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూషన్ (Motorola Edge 50 Fusion) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కన్ఫర్మ్ చేయడంతోపాటు ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా మోటరోలా ఈ సంగతి వెల్లడించింది.
Motorola Edge 50 Fusion | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూషన్ (Motorola Edge 50 Fusion) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కన్ఫర్మ్ చేయడంతోపాటు ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా మోటరోలా ఈ సంగతి వెల్లడించింది. గత నెలలో యూరప్‌తోపాటు సెలెక్టెడ్ మార్కెట్లలో మోటరోలా ఎడ్జ్50 ఫ్యుషన్ (Motorola Edge 50 Fusion) ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఐపీ రేటెడ్ బిల్డ్, 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరాల సెటప్, 68వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్వోసీ చిప్‌సెట్‌పై పని చేసే డిస్‌ప్లే కలిగి ఉంటుంది.
మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూషన్ (Motorola Edge 50 Fusion) ఫోన్‌ను ఈ నెల 16 మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్‌లో ఆవిష్కరిస్తుంది. మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూషన్ (Motorola Edge 50 Fusion_ ఫోన్ ఫారెస్ట్ బ్లూ, హాట్ పింక్, మార్ష్ మల్లో బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హెల్లో యూఐ ఓఎస్ వర్షన్‌పై పని చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తోపాటు 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల కర్వ్‌డ్ పోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. బయోమెట్రిక్ అథంటికేషన్ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌తో వస్తోంది.
మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూషన్ (Motorola Edge 50 Fusion) ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్వోసీ చిప్‌సెట్ విత్ 12 జీబీ ర్యామ్ కెపాసిటీతో రూపుదిద్దుకున్నది. 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటది. 50-మెగా పిక్సల్ సోనీ ల్యేతియా 700 సీ ప్రైమరీ సెన్సర్ రేర్ సెన్సర్ కెమెరా, 13-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ మాక్రో షూటర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా వస్తుంది.
మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూషన్ (Motorola Edge 50 Fusion) ఫోన్ 15 5జీ బాండ్లు, వై-ఫై 6 కనెక్టివిటీ కలిగి ఉంటుంది. వాటర్ రీపెల్లెంట్ డిజైన్‌తో ఐపీ68 రేటెడ్ సర్టిఫికేషన్, 68వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందీ ఫోన్. మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూషన్ (Motorola Edge 50 Fusion) ఫోన్ ధర ఎంత అన్నది వెల్లడించలేదు. గత నెలలో యూరప్ మార్కెట్‌లో ఆవిష్కరించినప్పుడు మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూషన్ ఫోన్ 399 యూరోలు (సుమారు రూ.35,900) పలుకుతున్నది.