మొబైల్ ఫోన్‌తో క్రియేటివ్ ఫొటోలు తీసేందుకు ట్రిక్స్!
ప్రస్తుతం మొబైల్స్‌లో వస్తున్న కెమెరాలు చిన్నవే అయినా వాటిలో ఉండే ఫీచర్లు డీయస్‌ఎల్‌ఆర్ కెమెరా రేంజ్‌లో ఉంటున్నాయి. మొబైల్స్‌లో ఇప్పుడు లేటెస్ట్‌గా వస్తున్న మల్టిపుల్ కెమెరా సెటప్‌తో మొబైల్ ఫొటోగ్రఫీ ఇంకో మెట్టు పైకెక్కింది.
అందమైన ఫొటోలు తీయాలంటే డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరా ఉండాలనుకుంటారు చాలామంది. కానీ, ఇప్పుడొస్తున్న మొబైల్స్‌తో కూడా అద్భుతమైన ఫోటోలు తీయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం మొబైల్స్‌లో వస్తున్న కెమెరాలు చిన్నవే అయినా వాటిలో ఉండే ఫీచర్లు డీయస్‌ఎల్‌ఆర్ కెమెరా రేంజ్‌లో ఉంటున్నాయి. మొబైల్స్‌లో ఇప్పుడు లేటెస్ట్‌గా వస్తున్న మల్టిపుల్ కెమెరా సెటప్‌తో మొబైల్ ఫొటోగ్రఫీ ఇంకో మెట్టు పైకెక్కింది. కొన్ని సింపుల్ టెక్నిక్స్, ఫీచర్స్‌ను ఉపయోగించి, ప్రొఫెషనల్ లుక్ ఉండేలా ఫొటోలు తీయొచ్చు.
హెచ్‌డీఆర్
ఇప్పుడొస్తున్న ప్రతీ మొబైల్ కెమెరాలో ‘హెచ్‌డీఆర్’ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్‌తో ప్రొఫెషనల్ లుక్ ఉండేలా ఫొటోలు తీయొచ్చు. హెచ్‌డీఆర్ అంటే ‘హై డైనమిక్ రేంజ్’. ఈ మోడ్‌లో ఫొటోలు తీస్తే.. దూరంగా ఉన్న కొండలు లేదా ఆబ్జెక్ట్స్ లాంటివి కూడా క్లియర్‌గా కనిపిస్తాయి. లైటింగ్‌లో హెచ్చుతగ్గులుంటే.. ఈ మోడ్ వాటిని బ్యాలెన్స్ చేస్తుంది.
పోట్రెయిట్ మోడ్
ఈ మధ్య వస్తున్న అన్ని మొబైల్స్‌లో పొట్రెయిట్ మోడ్ ఆప్షన్ ఉంటుంది. ఫ్రేమ్‌లో ఉన్న మనిషిని ఫోకస్‌లో ఉంచి మిగతా బ్యాక్‌గ్రౌండ్‌ని బ్లర్ చేయడం ఈ మోడ్ స్పెషాలిటీ. పోట్రెయిట్ మోడ్‌లో తీసే ఫొటోలు డీయస్‌ఎల్‌ఆర్ లుక్‌కు దగ్గరగా ఉంటాయి.
బస్ట్ మోడ్
చాలా మొబైల్ కెమెరాల్లో ‘బస్ట్ మోడ్’ ఆప్షన్ ఉంటుంది. కానీ, దీన్ని ఎవరూ అంతగా వాడరు. బస్ట్ మోడ్‌లో కెమెరా కంటిన్యూస్‌గా ఫొటోలు తీస్తుంది. స్పోర్ట్స్ ఫొటోగ్రఫీ, యాక్షన్ ఫొటోగ్రఫీలో ఈ ఫీచర్ ఎక్కువగా వాడుతుంటారు. చాలామంది గాల్లోకి ఎగిరిన ఫొటో స్టి్ల్స్ పెడుతుంటారు. అలాంటి ఫొటోలు మామూలుగా తీయడం కష్టం. సరిగ్గా గాల్లో ఉన్నప్పుడు కరెక్ట్‌గా క్లిక్ మనిపించడం కుదరని పని. అలాంటప్పుడు బస్ట్ మోడ్‌ని ఉపయోగించొచ్చు. బస్ట్ మోడ్ ఆన్ చేసి క్లిక్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే.. కెమెరా వరుసపెట్టి ఫొటోలు తీస్తుంది. తర్వాత మనకు నచ్చిన పర్‌ఫెక్ట్ షాట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
గ్రిడ్ లైన్స్
ప్రొఫెషనల్ కెమెరా అయినా, మొబైల్ కెమెరా అయినా గ్రిడ్ లైన్స్‌ను ఉపయోగించడం తెలిస్తే అందమైన ఫొటోలు తీయడం తేలిక. ఇప్పుడొస్తున్న అన్ని మొబైల్ కెమెరా అప్లికేషన్స్‌లో గ్రిడ్ మోడ్ లేదా షో గ్రిడ్ లైన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఆన్ చేయగానే స్క్రీన్ పై గ్రిడ్ లైన్స్ కనిపిస్తాయి. ఫొటో తీసేటప్పుడు ఆబ్జెక్ట్‌ను లైన్స్ కలుసుకునే చోట ప్లేస్ చేయాలి. ఈ టెక్నిక్‌ను ‘రూల్ ఆఫ్ థర్డ్స్’ అంటారు. ప్రతీ ఫొటోకు ఈ టెక్నిక్ అప్లై చేస్తే.. ఫొటోలు చాలా అందంగా కనిపిస్తాయి.
ఇవి కూడా..
కెమెరా ఫ్లాష్‌తో కూడా కొన్ని ట్రిక్స్ ఉపయోగించొచ్చు. కెమెరా ఫ్లాష్ ఆన్ చేసి సబ్జెక్ట్‌కి, కెమెరాకు మధ్యలో ఏదైనా ప్యాట్రన్ వచ్చేలా మెష్ లేదా గ్రిల్స్ లాంటివి పెట్టాలి. తర్వాత ఫ్లాష్ ఆన్ చేసి ఫొటో తీస్తే.. సబ్జెక్ట్‌పై షాడోస్ ప్యాట్రన్‌లా పడి ఫొటోలకు డ్రమాటిక్ లుక్‌నిస్తాయి.
మొబైల్‌ను వాటర్ రెసిస్టెన్స్ కవర్‌లో పెట్టి అండర్ వాటర్ ఫొటోలు ట్రై చేయొచ్చు. అయితే అండర్ వాటర్ ఫొటోలు మంచిగా రావాలంటే వాటర్ చాలా క్లియర్‌గా ఉండాలి.
మొబైల్‌తో తీసే ఫొటోలు అందంగా, క్లియర్‌గా ఉండాలంటే ముందు కెమెరాను నీట్‌గా ఉంచుకోవాలి. కెమెరాపై ఉండే గ్లాస్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. మొబైల్ కింద పెట్టినప్పుడు కెమెరా లెన్స్‌పై గీతలు పడకుండా పౌచ్ వాడాలి.
ప్రతీ మొబైల్‌కు హయ్యెస్ట్ రెజల్యూషన్ ఒకటుంటుంది. ఫొటోలు వీడియోలు తీసేటప్పుడు ఆ రెజల్యూషన్ లోనే తీస్తున్నారో, లేదో చెక్ చేసుకోవాలి. కెమెరా సెట్టింగ్స్‌కి వెళ్లి వీడియో సైజ్, ఇమేజ్ క్వాలిటీ ఆప్షన్స్‌లో హయ్యెస్ట్ సైజ్, హయ్యెస్ట్ క్వాలిటీ ఉండేలా చూసుకోవాలి.
ఫొటో తీసేటప్పుడు తీయాలనుకుంటున్న ఆబ్జెక్ట్‌ని సరిగ్గా ఫోకస్ చేయడం ముఖ్యం. దూరంగా ఉన్న వాటిని ఫొటో తీసేందుకు చాలామంది జూమ్ చేస్తుంటారు. జూమ్ చేయడం వల్ల ఫొటో రెజల్యూషన్ తగ్గి ఫొటో మసకగా కనిపిస్తుంది. దీనికంటే మంచి రెజల్యూషన్‌తో ఫొటో తీసి కావల్సినంత క్రాప్ చేసుకోవడం బెటర్.