Telugu Global
Science and Technology

లావా నుంచి బ్లేజ్ ఎక్స్ వచ్చింది! ఫీచర్లివే..

తాజాగా ‘లావా బ్లేజ్ ఎక్స్ 5జీ(Lava Blaze X)’ పేరుతో మరో కొత్త ఫోన్ లాంఛ్ చేసింది.

లావా నుంచి బ్లేజ్ ఎక్స్ వచ్చింది! ఫీచర్లివే..
X

దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా.. వరుగా మంచి మంచి ఫోన్లు లాంఛ్ చేస్తూ మార్కెట్‌లో రీబ్రాండింగ్ కోసం ప్రయత్నిస్తుంది. తాజాగా ‘లావా బ్లేజ్ ఎక్స్ 5జీ(Lava Blaze X)’ పేరుతో మరో కొత్త ఫోన్ లాంఛ్ చేసింది. ఈ ఫోన్ ఫీచర్లు, ధరల వివరాల్లోకి వెళ్తే..

లావా బ్లేజ్ ఎక్స్ 5జీ మొబైల్.. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ క్లీన్ యూఐపై రన్ అవుతుంది. ఇందులో 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ రెజల్యూషన్ కలిగిన త్రీడీ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

లావా బ్లేజ్ ఎక్స్ 5జీ మొబైల్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతోపాటు మరో సెకండరీ డెప్త్ సెన్సర్, ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. అలాగే ఇందులో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఇక వీటితోపాటు లావా బ్లేజ్ ఎక్స్ 5జీలో డ్యుయల్ నానో సిమ్ సపోర్ట్, ఎల్‌పీ డీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్, వర్చువల్ ర్యామ్, బ్లూటూత్ 5.2 , వైఫై 5, జీపీఎస్, ఓటీజీ సపోర్ట్, 5జీ, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌‌ప్రింట్ సెన్సర్, ఐపీ52-రేటింగ్‌ వంటి ఫీచర్లున్నాయి. ధరల విషయానికొస్తే. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999, 6 జీబీ ర్యామ్ +128జీబీ స్టోరేజ్‌ ధర రూ. 15,999, 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 16,999గా ఉన్నాయి. పర్పుల్, గ్రే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. జులై 20 నుంచి సేల్‌కు అందుబాటులో ఉంటుంది.



First Published:  11 July 2024 12:00 PM GMT
Next Story