Itel P55 | భారత్‌లో రూ.10 వేలలోపు తొలి 5జీ స్మార్ట్ ఫోన్.. త్వరలో ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Itel P55 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ (Itel) భారత్ మార్కెట్లోకి అత్యంత చౌకగా 5జీ స్మార్ట్‌ఫోన్ ఐటెల్ పీ55 (Itel P55) అందుబాటులోకి తెస్తున్నది.
Itel P55 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ (Itel) భారత్ మార్కెట్లోకి అత్యంత చౌకగా 5జీ స్మార్ట్‌ఫోన్ ఐటెల్ పీ55 (Itel P55) అందుబాటులోకి తెస్తున్నది. ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ గల 5జీ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో ఉన్నాయి. ప్రధానంగా 5జీ స్మార్ట్ ఫోన్లు మిడ్‌రేంజ్ ధరతో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఐటెల్ పీ55 (Itel P55) స్పెషిఫికేషన్స్ వెల్లడించకున్నా.. 5జీ కనెక్టివిటీ ప్రధాన ఫీచర్ కానున్నదని తెలుస్తున్నది. 91మొబైల్స్ రిపోర్ట్ ప్రకారం ఐటెల్ పీ55 5జీ (Itel P55 5G) త్వరలో ఆవిష్కరిస్తుంది. రూ.10 వేల లోపు ధరకే వస్తున్న 5జీ-సపోర్టెడ్ తొలి ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా పండుగల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ నెలాఖరులో ఐటెల్ (Itel) తన ఐటెల్ పీ55 5జీ (Itel P55 5G) ఆవిష్కరిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లకు పెట్టింది పేరు ఐటెల్ (Itel). ఐటెల్ ఏ60ఎస్ ధర (Itel A60s) రూ.6,499 (ఎక్స్ షోరూమ్), ఐటెల్ పీ40+ (Itel P40+) ధర రూ.8,099 (ఎక్స్ షోరూమ్)లకు లభిస్తున్నాయి.
ఐటెల్ (Itel) తన ఐటెల్ పీ55 5జీ (Itel P55 5G) ఫోన్ క్వాడ్‌కోర్ యూనిసోక్ ఎస్‌సీ9863 ఏ1 ఎస్వోసీ చిప్ సెట్ (quad-core Unisoc SC9863A1 SoC) ఫోన్ కలిగి ఉంటుందని సమాచారం. 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా మార్కెట్లోకి వస్తుందని చెబుతున్నారు.
ఐటెల్ ఏ60ఎస్ స్మార్ట్ ఫోన్ 6.6-అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, డ్యుయల్ 8- మెగా పిక్సెల్ ఏఐ కెమెరా, 10వాట్ల చార్జింగ్ మద్దతుతో 5,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వచ్చింది. ఐటెల్ పీ40+ (Itel P40+) ఒక్టాకోర్ యూనిసోక్ టీ606 ఎస్వోసీ (octa-core Unisoc T606 SoC) చిప్‌సెట్‌తోపాటు 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 7,000 ఎంఏహెచ్ కెపాసిటీ కల బ్యాటరీ కలిగి ఉంది. ఐటెల్ పీ40+ ఫోన్ 6.8-అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ స్క్రీన్, ఏఐ నేపథ్యంతో 13-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వచ్చింది.