పెద్ద బ్యాటరీ, ఇంట్రెస్టింగ్ ఫీచర్లతో ఐకూ బడ్జెట్ ఫోన్!
ఐకూ నుంచి పది వేల రూపాయల బడ్జెట్లో ‘ఐకూ జెడ్9 ఎక్స్’ మొబైల్ లాంఛ్ అయింది. ఈ మొబైల్ లేటెస్ట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్.. ఫన్ టచ్ ఓఎస్‌పై రన్ అవుతుంది. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ప్రాసెసర్‌గా దీన్ని చెప్పుకోవచ్చు.
ఫ్లాగ్‌షిప్ మార్కెట్లో మంచి వాల్యూ క్రియేట్ చేసుకున్న ఐకూ బ్రాండ్.. ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్స్‌పై కూడా ఫోకస్ పెడుతోంది. తాజాగా ఇండియన్ మార్కె్ట్లోకి ‘ఐకూ జెడ్ 9 ఎక్స్(iQOO Z9x)’ ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఈ మొబైల్ ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే..
ఐకూ నుంచి పది వేల రూపాయల బడ్జెట్లో ‘ఐకూ జెడ్9 ఎక్స్’ మొబైల్ లాంఛ్ అయింది. ఈ మొబైల్ లేటెస్ట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్.. ఫన్ టచ్ ఓఎస్‌పై రన్ అవుతుంది. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ప్రాసెసర్‌గా దీన్ని చెప్పుకోవచ్చు.
ఈ ఫోన్‌లో 6.72 -అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుని సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరాల విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 ఎంపీ సెకండరీ సెన్సర్ ఉంటుంది. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.
ఐక్యూ జెడ్ 9 ఎక్స్‌లో బ్యాటరీ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఇందులో 6000 ఎంఎహెచ్ కెపాసిటీ కలిగిన -అల్ట్రాథిన్ గ్రాఫైట్ బ్యాటరీ అమర్చారు. సింగిల్ ఛార్జ్.. రెండు రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
ఇక వీటితోపాటు ఈ మొబైల్ అల్ట్రా-స్లిమ్ డిజైన్‌తో ఉంటుంది. అడాప్టివ్ డిస్‌ప్లే, డ్యుయల్ స్టీరియో స్పీకర్స్, ఐపీ64 వాటర్ రెసిస్టెన్స్, 5జీ కనెక్టివిటీ, అడ్రినో 710 గ్రాఫిక్స్, బ్లూటూత్ 5.1, వైఫై5 వంటి ఫీచర్లు కలిగి ఉంది.
ఫోన్ ధరల వివరాల్లోకి వెళ్తే.. 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.12,999, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14,499, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15,999గా ఉన్నాయి. లాంఛింగ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు ఉన్నాయి. టోర్నడో గ్రీన్, స్టార్మ్ గ్రే అను రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.