Telugu Global
Science and Technology

సూపర్ ఫీచర్లతో ఐకూ బడ్జెట్ ఫోన్ రిలీజ్!

ఐకూ నుంచి ‘ఐకూ జెడ్9 లైట్ 5జీ (iQoo Z9 Lite 5G)’ పేరుతో ఓ మొబైల్ లాంఛ్ అయింది. పది వేల రూపాయల బడ్జెట్‌లో తీసుకొచ్చిన ఈ మొబైల్.. మంచి బ్యాటరీ, కెమెరా, ప్రాసెసర్‌‌తో వస్తుంది.

సూపర్ ఫీచర్లతో ఐకూ బడ్జెట్ ఫోన్ రిలీజ్!
X

మిడ్‌రేంజ్ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్‌గా పాపులర్ అయిన ‘ఐకూ’.. బడ్జెట్ ఫ్లెండ్లీ మొబైల్స్‌పై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే తక్కువ బడ్జెట్‌లో ఓ ఫోన్ రిలీజ్ చేసింది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ల వివరాల్లోకి వెళ్తే..

ఐకూ నుంచి ‘ఐకూ జెడ్9 లైట్ 5జీ (iQoo Z9 Lite 5G)’ పేరుతో ఓ మొబైల్ లాంఛ్ అయింది. పది వేల రూపాయల బడ్జెట్‌లో తీసుకొచ్చిన ఈ మొబైల్.. మంచి బ్యాటరీ, కెమెరా, ప్రాసెసర్‌‌తో వస్తుంది.

ఐకూ జెడ్9 లైట్ 5జీ.. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌‌పై చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్‌పై రన్ అవుతుంది. ఇందులో 6.56 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుని సపోర్ట్ చేస్తుంది. 840 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

ఐకూ జెడ్9 లైట్ మొబైల్‌లో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతోపాటు మరో సెకండరీ డెప్త్ సెన్సర్, ముందువైపు 8-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఏఐ బేస్డ్ ఫోటో ఎడిటింగ్ ఆప్షన్లు ఇందులో ప్రత్యేకత. అలాగే ఇందులో 15వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఇకపోతే ఐకూ జెడ్9 లైట్ డిజైన్ ప్రీమియంగా ఉంటుంది. ఐపీ 64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌‌ ఉంది. ఆక్వా ఫ్లో, మోచా బ్రౌన్ వంటి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో వై-ఫై 5, బ్లూటూత్ 5.4, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఓటీజీ సపోర్ట్, మైక్రో ఎస్‌డీ సపోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి ఫీచర్లున్నాయి.

ఐకూ జెడ్9 లైట్ 5జీ ధరల విషయానికొస్తే.. 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499 ఉంది. 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.11,499లకు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లు, కార్డు డిస్కౌంట్‌లు కూడా ఉన్నాయి. ఈ నెల 20 నుంచి సేల్‌కు రెడీగా ఉంటుంది.

First Published:  16 July 2024 1:38 PM GMT
Next Story