iQoo Z7 Pro 5G | 31న ఐక్యూ జడ్7 ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరణ.. ఇవే స్పెసిఫికేషన్స్?!
iQoo Z7 Pro 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో సబ్ బ్రాండ్ ఐక్యూ (iQoo) తన ఐక్యూ జడ్7 ప్రో 5జీ (iQoo Z7 Pro 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించడానికి ముహూర్తం ఖరారైంది.
iQoo Z7 Pro 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో సబ్ బ్రాండ్ ఐక్యూ (iQoo) తన ఐక్యూ జడ్7 ప్రో 5జీ (iQoo Z7 Pro 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించడానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 31న భారత్‌లో తన జడ్ సిరీస్ పోన్లను ఆవిష్కరిస్తామని ఐక్యూ తన సోషల్ మీడియా వేదికలపై టీజ్ చేసింది. ఐక్యూ జడ్7 ప్రో 5జీ (iQoo Z7 Pro 5G) ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + కర్వ్‌డ్ అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 66వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఎస్వోసీ చిప్‌సెట్ ఉంటుందని సమాచారం. చైనా మార్కెట్లో 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో ఆవిష్కృతమైన ఐక్యూ జడ్7 ప్రో 5జీ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ.25 వేలు (సుమారు 2099 చైనా యువాన్లు)గా ఉంది.
ఆండ్రాయిడ్-13 వర్షన్‌పై ఐక్యూ జడ్7 ప్రో 5జీ ((iQoo Z7 Pro 5G)) ఫోన్ పని చేస్తుందని తెలుస్తున్నది. రేర్ ప్యానెల్‌పై మాలి జీ610 జీపీయూ, ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ రామ్‌తో గ్లాస్ ప్యానెల్ ఉంటుంది. ఇంతకుముందు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతుతో 64-మెగా పిక్సెల్స్ ఔరా లైట్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుందని వార్తలొచ్చాయి. దీంతోపాటు 2-మెగా పిక్సెల్ కెమెరా ఉండొచ్చు. ఇక సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
ఈ ఫోన్ బ్లూటూత్ 5.3, వై-ఫై 6 కనెక్టివిటీ కలిగి ఉంటుంది. బయోమెట్రిక్ అథంటికేషన్ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింటర్ సెన్సర్‌తో వస్తున్నది. ఐక్యూ, అమెజాన్ ఇండియా వెబ్‌సైట్లలో ఐక్యూ జడ్7 ప్రో 5జీ ఫోన్ల స్పెషిఫికేషన్లతో మైక్రోసైట్‌లు క్రియేట్ చేశారు. ఇక ఐక్యూ జడ్7 ప్రో 5జీ ఫోన్ ధర భారత్‌లో రూ.25 వేల నుంచి రూ.30 వేల ఉండొచ్చునని భావిస్తున్నారు.
భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన తర్వాత అమెజాన్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ ఆర్డర్లు ప్రారంభం అవుతాయని తెలుస్తున్నది. వివో ఎస్17ఈ ఫోన్‌ను రీబ్రాండ్ చేసి విడుదల చేస్తున్న ఐక్యూ జడ్7 ప్రో 5జీ ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుందని భావిస్తున్నారు. వివో ఎస్17ఈ ఫోన్ 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.24,192 (2099 చైనా యువాన్లు), 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టొరేజీ వేరియంట్ దాదాపు రూ. 26,483 (2299 చైనా యువాన్లు), 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు 28,787 (2499 చైనా యువాన్లు) పలుకుతుంది.