iQoo Neo 7 Pro 5G | మార్కెట్లోకి ఐక్యూ నియో 7ప్రో.. ఇవీ స్పెషిఫికేషన్స్.. ఆ కార్డులతో డిస్కౌంట్లు ఇలా..!
iQoo Neo 7 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ తన మిడ్‌రేంజ్ స్మార్ట్ ఫోన్.. ఐక్యూ నియో7 ప్రో 5జీ (iQoo Neo 7 Pro 5G) మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించారు.
iQoo Neo 7 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ తన మిడ్‌రేంజ్ స్మార్ట్ ఫోన్.. ఐక్యూ నియో7 ప్రో 5జీ (iQoo Neo 7 Pro 5G) మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించారు. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 (Qualcomm's Snapdragon 8+ Gen 1) ప్రాసెసర్‌తో వస్తున్నది. 120 వాట్ల చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌తోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.78-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తున్నది. ఇది 256 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంటుంది. దేశీయ మార్కెట్లోకి ఐక్యూ నియో 7 ప్రో 5జీ (iQoo Neo 7 Pro 5G) రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
ఐక్యూ నియో 7 ప్రో 5జీ (iQoo Neo 7 Pro 5G) 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.34,999లకు, 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.37,999లకు లభిస్తుంది. డార్క్ స్టోర్మ్, ఫియర్‌లెస్ ఫ్లేమ్ కలర్స్‌లో సొంతం చేసుకోవచ్చు. కంపెనీ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు అమెజాన్ ఇండియా, ఇతర రిటైల్ ఔట్‌లెట్లలో ఈ నెల 15 నుంచి లభ్యం అవుతుంది ఐక్యూ నియో 7 ప్రో 5జీ (iQoo Neo 7 Pro 5G). ఈ నెల 18 లోగా కొనుగోలు చేసిన వారికి రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులపై రూ.2000ల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ప్రీ-బుకింగ్స్ చేసుకున్న కస్టమర్లకు ఏడాది పాటు అదనపు వారంటీ లభిస్తుంది.
ఐక్యూ నియో 7 ప్రో 5జీ ఫోన్ (iQoo Neo 7 Pro 5G) ఆండ్రాయిడ్ 13 విత్ ఫన్‌టచ్ ఓఎస్ 13 స్కిన్ ఆన్ టాప్ వర్షన్ మీద పని చేస్తుంది. ఈ ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,080x2,400 పిక్సెల్స్) అమోలెడ్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది.
ఐక్యూ నియో 7 ప్రో 5జీ ఫోన్‌లో 50మెగా పిక్సెల్స్ ప్రైమరీ శాంసంగ్ జీఎన్5 సెన్సర్ విత్ ఎఫ్/1.88 అపెర్చర్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా విత్ ఎఫ్/2.2 అపెర్చర్, 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరా విత్ ఎఫ్/2.2 అపెర్చర్, సెల్ఫీలూ వీడియో చాటింగ్ కోసం 16-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ ఎఫ్/2.45 అపెర్చర్ కలిగి ఉంటుంది.
5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, జీఎన్ఎస్ఎస్, నేవ్ ఐసీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సిలో మీటర్, ఆంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, ఈ-కంపాస్, గైరోస్కోప్, కలర్ టెంపరేచర్ సెన్సర్ ఉన్నాయి. ఇంకా బయోమెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్, రిమోట్ కంట్రోల్ కోసం ఐఆర్ బ్లాస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 120 వాట్ల ఫ్లాష్ చార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.