Telugu Global
Science and Technology

iQoo Phones Discounts | అమెజాన్ గ్రేట్ స‌మ్మ‌ర్ సేల్‌.. ఐక్యూ ఫోన్ల‌పై డిస్కౌంట్లు.. గ‌రిష్టంగా రూ.23 వేల రాయితీ..!

iQoo Phones Discounts | ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ గ్రేట్ స‌మ్మ‌ర్ సేల్‌-2024లో భాగంగా ఐక్యూ (iQoo) త‌న ఫోన్ల‌పై డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది.

iQoo Phones Discounts | అమెజాన్ గ్రేట్ స‌మ్మ‌ర్ సేల్‌.. ఐక్యూ ఫోన్ల‌పై డిస్కౌంట్లు.. గ‌రిష్టంగా రూ.23 వేల రాయితీ..!
X

iQoo Phones Discounts | ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ గ్రేట్ స‌మ్మ‌ర్ సేల్‌-2024లో భాగంగా ఐక్యూ (iQoo) త‌న ఫోన్ల‌పై డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది. మే రెండో తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి ప్రారంభ‌మైన ఈ సేల్స్ ఆరు రోజుల పాటు కొన‌సాగుతాయి. ఐక్యూతోపాటు ప‌లు లీడింగ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు రియ‌ల్‌మీ, పోకో, వ‌న్‌ప్ల‌స్ త‌మ ఫోన్ల‌పై డిస్కౌంట్లు ప్ర‌క‌టించాయి. ఐక్యూ స్మార్ట్ ఫోన్లు త‌క్కువ ధ‌ర‌ల‌కే అందుబాటులోకి వ‌స్తాయి.

ఐక్యూ 12, ఐక్యూ జ‌డ్‌9, ఐక్యూ నియో 7 ప్రో, ఐక్యూ జ‌డ్7 ప్రో, ఐక్యూ జ‌డ్‌6 లైట్ ఫోన్ల‌పై రూ.4000 వ‌ర‌కు డిస్కౌంట్ ల‌భిస్తుంది. గ‌తేడాది ఐక్యూ ఆవిష్క‌రించిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ ఐక్యూ11 ఫోన్‌పై గ‌రిష్టంగా రూ.23 వేల వ‌ర‌కూ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.

ఐక్యూ జ‌డ్‌9 ఫోన్‌ను సెలెక్టెడ్ బ్యాంక్ కార్డుల‌పై బుక్ చేసుకున్న క‌స్ట‌మ‌ర్ల‌కు రూ.2000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌, రూ.1000 ఎక్స్చేంజ్ బోన‌స్‌తోపాటు రూ.599 విలువైన వివో ఇయ‌ర్ పోన్లు ఉచితంగా అంద‌జేస్తారు. ఐక్యూ నియో 9 ప్రో ఫోన్‌పై రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌, రూ.2,000 ఎక్స్చేంజ్ బోన‌స్ అందిస్తారు. వేర్వేరు ఐక్యూ ఫోన్ల ధ‌ర‌లు ఇలా..

ఫోన్ పేరు.. ఎంఆర్పీ-- -- సేల్స్ ధ‌ర‌

ఐక్యూ 12 -- రూ.52,999 -- రూ. 49,999

ఐక్యూ 11 -- రూ. 64,999 - రూ. 41,999

ఐక్యూ నియో 9 ప్రో - రూ.35,999 - రూ.31,999

ఐక్యూ జ‌డ్‌9 -- రూ.19,999 - రూ.17,999

ఐక్యూ జ‌డ్‌7 ప్రో - రూ. 23,999 - రూ. 20,999

ఐక్యూ నియో 7 ప్రో- రూ.32,999 - రూ.29,999

ఐక్యూ జ‌డ్‌6 లైట్ - రూ. 12,999 - రూ.10,999

First Published:  3 May 2024 12:12 PM IST
Next Story