iPhone 15 Series | ఆపిల్ ఐ-ఫోన్15 సిరీస్ ఫోన్ల ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు.. `వండర్‌లస్ట్` వేదిక.. ఇవీ డిటైల్స్
iPhone 15 Series | గ్లోబల్ టెక్ దిగ్గజం `ఆపిల్ (Apple)` తన ఐ-పోన్ 15 సిరీస్ (iPhone 15 Series) ఫోన్ల ఆవిష్కరణ ముహూర్తం ఖరారైంది. ఆపిల్ వండర్‌లస్ట్ (Wonderlust)` ఈవెంట్‌లో ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్ల (iPhone 15 Series) ను మార్కెట్లో ఆవిష్కరిస్తారు.
iPhone 15 Series | గ్లోబల్ టెక్ దిగ్గజం `ఆపిల్ (Apple)` తన ఐ-పోన్ 15 సిరీస్ (iPhone 15 Series) ఫోన్ల ఆవిష్కరణ ముహూర్తం ఖరారైంది. ఆపిల్ వండర్‌లస్ట్ (Wonderlust)` ఈవెంట్‌లో ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్ల (iPhone 15 Series) ను మార్కెట్లో ఆవిష్కరిస్తారు. సెప్టెంబర్ 12న జరిగే లైవ్ స్ట్రీమ్ కార్యక్రమంలో ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లతోపాటు ఆపిల్ వాచ్ సిరీస్ 9 (Apple Watch Series 9), ఆపిల్ వాచ్ ఆల్ట్రా 2 (Apple Watch Ultra 2), ఐఓఎస్ 17 (iOS 17), వాచ్ ఓఎస్ 10 (watchOS 10) కూడా ఆవిష్కరిస్తారని భావిస్తున్నారు. వచ్చేనెల 12న ఆపిల్ `వండర్‌లస్ట్` కార్యక్రమంలో ఏయే ప్రొడక్ట్‌లు మార్కెట్లో ఆవిష్కరిస్తామన్న సంగతి సంస్థ వెల్లడించలేదు.
కాలిఫోర్నియాలోని `ఆపిల్ పార్క్ (Apple Park)`లో `వండర్‌లస్ట్` కార్యక్రమానికి హాజరు కావాలని అధికారికంగా ఆపిల్ (Apple) ఆహ్వానాలు పంపింది. సెప్టెంబర్ 12వ తేదీ ఉదయం 10 గంటల (భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలు) కు లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఆపిల్ డాట్ కాం (apple.com), ఆపిల్ టీవీ యాప్ (Apple TV app) లపై ఆన్‌లైన్‌లో లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది.
ఐ-ఫోన్ 15 (iPhone 15) తోపాటు ఐ-ఫోన్ 15 ప్లస్ (iPhone 15 Plus), ఐ-ఫోన్ 15 ప్రో (iPhone 15 Pro), ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ఫోన్లు కూడా ఆపిల్ ఆవిష్కరించనున్నది. లైటెనింగ్ పోర్ట్ (Lightning port) స్థానంలో యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ (USB Type-C charging port) వాడతారని వార్తలొస్తున్నాయి. ఈ ఫోన్ల స్పెషిఫికేషన్స్, డిజైన్, కలర్ ఆప్షన్లు, వేరియంట్ల గురించి పలు వదంతులు వచ్చాయి.
ఆపిల్ వాచ్ సిరీస్ 8 కొనసాగింపుగా ఆపిల్ వాచ్ సిరీస్ 9 (Apple Watch Series 9) , ఆపిల్ వాచ్ ఆల్ట్రా2 (Apple Watch Ultra 2) అనే రెండు స్మార్ట్ వాచ్‌లు ఆవిష్కరిస్తారని సమాచారం. వాచ్ సిరీస్ 9.. ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ మోడల్ వాచ్‌లు త్రీ కలర్ వేస్‌లో వస్తాయి. సెకండ్ జనరేషన్ ఆపిల్ వాచ్ ఆల్ట్రా మోడల్ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో తయారు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి.