Telugu Global
Science and Technology

ఐఫోన్ 15 రిలీజ్ నేడే.. ప్రత్యేకతలివే..

టెక్‌ దిగ్గజం యాపిల్.. నేడు లేటెస్ట్ ఐఫోన్ 15 ను రిలీజ్ చేయబోతోంది. యూఎస్‌లోని కాలిఫోర్నియాలో ఉన్న యాపిల్ పార్క్‌లో ఈ రోజు జరగనున్న ‘వండర్‌లస్ట్’ ఈవెంట్ వేదికగా యాపిల్ తన లేటెస్ట్ డివైజ్‌లు, ఓఎస్ వెర్షన్స్‌ను లాంచ్ చేయబోతోంది.

ఐఫోన్ 15 రిలీజ్ నేడే.. ప్రత్యేకతలివే..
X

టెక్‌ దిగ్గజం యాపిల్.. నేడు లేటెస్ట్ ఐఫోన్ 15 ను రిలీజ్ చేయబోతోంది. యూఎస్‌లోని కాలిఫోర్నియాలో ఉన్న యాపిల్ పార్క్‌లో ఈ రోజు జరగనున్న ‘వండర్‌లస్ట్’ ఈవెంట్ వేదికగా యాపిల్ తన లేటెస్ట్ డివైజ్‌లు, ఓఎస్ వెర్షన్స్‌ను లాంచ్ చేయబోతోంది. ఇంకా ఈ ఈవెంట్ ప్రత్యేకతలేంటంటే..

వండర్ లస్ట్ ఈవెంట్‌లో భాగంగా యాపిల్ లేటెస్ట్ ఐఫోన్15 సిరీస్‌తోపాటు, ఐప్యాడ్‌లు, కొత్త వాచ్‌ సిరీస్‌ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ కొత్త సిరీస్‌లో ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ఫోన్లు ఉండనున్నాయి. వీటితో పాటు యాపిల్‌ ఐఓఎస్‌ 17, ఐప్యాడ్‌ఓఎస్‌ 17, మ్యాక్‌ ఓఎస్ 14, టీవీఓఎస్‌ 17, వాచ్‌ ఓఎస్‌ 10, మ్యాక్‌ ఓఎస్‌ సోనోమా వంటి ఓఎస్ అప్‌డేట్స్‌ గురించి కూడా ఈవెంట్లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అలాగే యాపిల్‌ గ్యాడ్జెట్స్‌లో భాగంగా యాపిల్ వాచ్‌ సిరీస్‌ 9, యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ అల్ట్రా 9 కూడా లాంచ్‌ చేయొచ్చు. అంతేకాకుండా ఇండియన్ యూజర్ల కోసం ఐవోఎస్ 17లో ప్రత్యేక ఫీచర్లను తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తోంది.

కొత్త ఐఫోన్ సిరీస్‌లో రెండు కొత్త ఫీచర్లు ఉండబోతున్నట్టు యాపిల్ ప్రకటించింది. ఇండియన్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని ఐఫోన్‌లలో డ్యుయల్ సిమ్ కార్డ్‌ ఫీచర్, ఛార్జింగ్‌ కోసం యూఎస్ బీ టైప్ సీ పోర్ట్‌ తీసుకురానుంది.

లేటెస్ట్ ఐవోఎస్ 17లో ప్రైమరీ, సెకండరీ సిమ్ ఫీచర్‌‌తో పాటు రెండు సిమ్‌లకు వేర్వేరు రింగ్ టోన్స్, మిస్డ్ కాల్ అలర్ట్స్ వంటివి ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సారి అప్‌డేట్‌తో ఐఫోన్ వాయిస్ అసిస్టెంట్ అయిన ‘సిరి’లో హిందీ, తెలుగు, పంజాబీ, కన్నడ, మరాఠి వంటి భాషల్లో కూడా మాట్లాడొచ్చు. అలాగే కీబోర్డ్‌లోనే బిల్ట్‌ఇన్‌ ట్రాన్సలేషన్‌ సపోర్టు కూడా ఉండబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ మలయాళంతో సహా పది భారతీయ భాషల్లోకి టెక్స్ట్‌ను అనువాదం చేసుకోవచ్చు.

యాపిల్‌ ‘వండర్ లస్ట్’ ఈవెంట్‌ను ఈ రోజు రాత్రి 10.30 గంటల నుంచి లైవ్‌లో చూడొచ్చు. యాపిల్‌ యూట్యూబ్‌ ఛానెల్‌, యాపిల్‌.కామ్‌ వెబ్‌సైట్‌, యాపిల్‌ టీవీ వంటి ప్లాట్‌ఫామ్స్‌లోఈవెంట్‌ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

First Published:  12 Sept 2023 4:00 PM IST
Next Story