Telugu Global
Science and Technology

పిల్లల స్క్రీన్ టైం తగ్గించేలా ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్!

ఇటీవల రోజుల్లో ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో ఇన్‌స్టాగ్రామ్ వాడకం బాగా ఎక్కువైంది. దీంతో పిల్లల ఇన్‌స్టాగ్రామ్ వాడకాన్ని తగ్గించేందుకు మెటా సంస్థ ‘నైట్ టైం నడ్జెస్’ అనే ఓ కొత్త టూల్‌ను తెచ్చింది.

పిల్లల స్క్రీన్ టైం తగ్గించేలా ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్!
X

ఇటీవల రోజుల్లో ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో ఇన్‌స్టాగ్రామ్ వాడకం బాగా ఎక్కువైంది. దీంతో పిల్లల ఇన్‌స్టాగ్రామ్ వాడకాన్ని తగ్గించేందుకు మెటా సంస్థ ‘నైట్ టైం నడ్జెస్’ అనే ఓ కొత్త టూల్‌ను తెచ్చింది. ఇదెలా పనిచేస్తుందంటే..

టీనేజ్ పిల్లలు, యువతలో చాలామంది రాత్రిళ్లు నిద్ర పోకుండా సోషల్ మీడియాలో గడుపుతుంటారు. దీన్ని కట్టడి చేసేందకుగానూ ఇన్‌స్టాగ్రామ్.. ‘నైట్ టైం నడ్జెస్’ అనే ఫీచర్ ప్రవేశపెట్టింది. రాత్రిళ్లు స్క్రీన్ టైంను తగ్గించేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా సుమారు ఐదు వందల కోట్ల మంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ఉన్నారు. ఇందులో టీనేజ్, యంగ్ ఏజ్‌లో ఉన్నవాళ్లే ఎక్కువ. అయితే ముఖ్యంగా చిన్నపిల్లల ప్రైవసీ, సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని వారి స్క్రీన్ టైంను తగ్గించేవిధంగా ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా పిల్లల మొబైల్ వాడకాన్ని కొంతవరకూ కంట్రోల్ చేసుకునే వీలుంటుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘నైట్‌ టైం నడ్జెస్‌’ ఫీచర్‌‌ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ప్రతీ పది నిమిషాలకోసారి నోటిఫికేషన్స్ వస్తాయి. . దీని ద్వారా పిల్లలు అర్థరాత్రి వరకు యాప్‌ను ఉపయోగించకుండా చూసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే లేట్ నైట్ టైంలో ప్రతి పది నిమిషాలకోసారి యాప్ క్లోజ్ చేయమని నోటిఫికేషన్ వస్తుంది. అదేపనిగా రీల్స్ చూసేవాళ్లకు నిద్ర పోవాలని గుర్తు చేసేలా ఈ ఫీచర్ ఉపయోగపడొచ్చు.

First Published:  23 Jan 2024 9:30 AM IST
Next Story