Telugu Global
Science and Technology

ఇన్‌ఫినిక్స్ నుంచి బడ్జెట్ గేమింగ్ ఫోన్! ఫీచర్లివే..

సాధారణంగా గేమింగ్ ఫోన్లు ఎక్కువ ధర కలిగి ఉంటాయి. అయితే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌లో పెరుగుతున్న పోటీ కారణంగా బడ్జెట్‌లో కూడా గేమింగ్ ఫోన్స్ అందుబాటులో వస్తున్నాయి.

ఇన్‌ఫినిక్స్ నుంచి బడ్జెట్ గేమింగ్ ఫోన్! ఫీచర్లివే..
X

సాధారణంగా గేమింగ్ ఫోన్లు ఎక్కువ ధర కలిగి ఉంటాయి. అయితే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌లో పెరుగుతున్న పోటీ కారణంగా బడ్జెట్‌లో కూడా గేమింగ్ ఫోన్స్ అందుబాటులో వస్తున్నాయి. తాజాగా ఇన్‌ఫినిక్స్ బ్రాండ్ బడ్జెట్‌లో గేమింగ్ ఫోన్ లాంఛ్ చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫినిక్స్.. మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో ‘ఇన్‌ఫినిక్స్ జీటీ 20 ప్రో 5జీ’ అనే గేమింగ్ ఫోన్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. మెరుగైన ప్రాసెసర్, ప్రత్యేకమైన గేమింగ్ చిప్‌తో ఈ ఫోన్ గేమింగ్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.

ఇన్‌ఫినిక్స్ జీటీ 20ప్రో మొబైల్.. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమ్ ఎస్ఓసీ ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఇండియాలో ఈ ప్రాసెసర్‌‌తో వస్తున్న మొదటి ఫోన్ ఇదే. ఈ మొబైల్ పూర్తిగా గేమింగ్ కోసం డిజైన్ చేయబడింది. ఇది ప్రత్యేకమైన కలర్స్‌తో స్పెషల్ డిజైన్ కలిగి ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్.. 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 144హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరాల విషయానికొస్తే.. ఇందులో 108 ఎంపీ సెన్సర్‌‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో పాటు ముందువైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఇక వీటితోపాటు ఈ మొబైల్‌లో గేమ్స్ ఆడేటప్పుడు హీట్ మ్యానేజ్ చేయడం కోసం వీసీ ఛాంబర్ కూలింగ్ టెక్నాలజీ ఫీచర్ ఉంది. మెరుగైన ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోసం జేబీఎల్ ట్యూన్డ్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. అలాగే ఎల్‌పీడీడీఆర్5 ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, పిక్సెల్‌వర్క్స్ ఎక్స్5 టర్బో డిస్‌‌‌ప్లే గేమింగ్ చిప్‌, కస్టమైజ్డ్ ఎల్ఈడీ ఇంటర్‌ఫేస్, ఎన్ ఎఫ్ సీ, ఐఆర్ బ్లాస్టర్, ఐపీ 54 వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లున్నాయి. ధరల వివరాల్లోకి వెళ్తే.. 8జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ. 24,999, 12 జీబీ+ 256 జీబీ వేరియంట్ ధర రూ.26,999గా ఉన్నాయి.

First Published:  21 May 2024 9:52 PM IST
Next Story