ఇలాంటి మెసేజ్‌లతో జాగ్రత్త!
సైబర్ నేరగాళ్లు ఫేక్ మెసేజ్‌లు, వాట్సాప్ మెసేజ్‌లతో బురిడీ కొట్టిస్తున్నారని స్టడీలు చెప్తున్నాయి. ఇటీవల చేసిన ‘గ్లోబల్ స్కామ్ మెసేజ్ స్టడీ’లో ప్రతి ఇండియన్‌కు రోజూ 12 ఫేక్ మెసేజ్‌లు వస్తున్నట్లు వెల్లడైంది.
సైబర్ మోసాల గురించి మనకు తెలిసిందే. చాలా రకాల సైబర్ స్కామ్‌లు ఫేక్ మెసేజ్‌లు, మెయిల్స్ ద్వారానే జరుగుతున్నాయి. నకిలీ మెసేజ్‌లను పంపి వాటి ద్వారా వ్యక్తులను నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు మోసగాళ్లు. అయితే దీనిపై స్టడీ నిర్వహించిన ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎలాంటి మెసేజ్‌ల ద్వారా ఎక్కువ మోసాలు జరుగుతున్నాయో గుర్తించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డిజిటల్ లిటరసీ లేని సామాన్యులను టార్గెట్ చేస్తూ.. సైబర్ నేరగాళ్లు ఫేక్ మెసేజ్‌లు, వాట్సాప్ మెసేజ్‌లతో బురిడీ కొట్టిస్తున్నారని స్టడీలు చెప్తున్నాయి. ఇటీవల చేసిన ‘గ్లోబల్ స్కామ్ మెసేజ్ స్టడీ’లో ప్రతి ఇండియన్‌కు రోజూ 12 ఫేక్ మెసేజ్‌లు వస్తున్నట్లు వెల్లడైంది. వాటిలో ఎక్కువమంది నమ్మి మోసపోతున్న మెసేజ్‌లు ఇవే..
ఫ్రీ రీఛార్జ్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్
మొబైల్ రీఛార్జ్ అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. అందులోనూ కొన్ని రీఛార్జ్ ప్లాన్ల ధరలు తక్కువ ధరలకే లభిస్తుంటాయి. అలాగే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల ధరలు కూడా రూ. 200, రూ.300 లోపులోనే ఉంటాయి. పైగా టెలికాం సంస్థలు, యూపీఐ యాప్స్ వంటివి కూడా తరచూ ఫ్రీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ను అందిస్తుంటాయి. అందుకే ఈ తరహా ఆఫర్లను జనం ఎక్కువగా నమ్ముతుంటారు. లింక్ క్లిక్ చేస్తే ఫ్రీ రీఛార్జ్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ అనగానే నిజమని లింక్ క్లిక్ చేస్తుంటారు. అలా ఈజీగా మోసపోతున్నారు.
జాబ్స్ ఆఫర్లు
ఆన్‌లైన్ జాబ్స్ కోసం వెతికేవాళ్లు ఎప్పుడు ఎక్కడ జాబ్ దొరుకుతుందా అన్న తొందరలో ఉండడం సహజం. ఈ అవసరాన్ని వాడుకుని నేరగాళ్లు మోసం చేస్తుంటారు. జాబ్ ఆఫర్ల పేరుతో నకిలీ మెసేజ్‌లు పంపుతుంటారు. ఇలాంటి మెసేజ్‌ల ద్వారా ఎక్కువమంది నష్టపోతున్నట్టు స్టడీలు చెప్తున్నాయి.
కెవైసీ
బ్యాంక్ అకౌంట్ కోసమని లేదా ఆధార్, పాన్ అప్‌డేట్ల పేరుతో కెవైసీ చేసుకోమని మెసేజ్‌లు వస్తుంటాయి. కెవైసీ చేయకపోతే అకౌంట్ పనిచేయదేమో అన్న భయంతో చాలామంది నకిలీ మెసేజ్‌లను క్లిక్ చేసి మోసపోతున్నారు.
డెలివరీ
మీ అడ్రెస్‌కు డెలివరీ వచ్చిందంటూ అప్పుడప్పుడు నకిలీ మెసేజ్‌లు వస్తుంటాయి. మీరు ఎలాంటి కొనుగోలు చేయకపోయినా మెసేజ్ వచ్చినప్పుడు వెంటనే అనుమానించాలి. కానీ, చాలామంది ఇలాంటి లింక్స్‌ను కూడా క్లిక్ చేసి మోసపోతున్నారని స్టడీలు చెప్తున్నాయి.
ఇకపోతే మీకు ప్రైజ్ మనీ వచ్చిందని, ఫ్రీ క్రెడిట్ కార్డ్/లోన్ అప్రూవ్ అయిందని వచ్చే మెసేజ్‌లను కూడా చాలామంది క్లిక్ చేసి మోసపోతున్నట్టు స్టడీలో తేలింది. కాబట్టి ఇలాంటి మెసేజ్‌ల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి.
డెలివరీ, కెవైసీ, జాబ్ ఆఫర్, డిస్కౌంట్.. ఇలా ఏ విషయంలోనైనా సదరు సంస్థ కేవలం మెసేజ్ ఒక్కటే పంపదు. దానికి సంబంధించిన మెయిల్ లేదా యాప్/వెబ్‌సైట్ నోటిఫికేషన్ వంటివి కూడా పంపుతుంది. డౌట్ వచ్చినప్పుడు అవికూడా చెక్ చేసుకోవడాలి. గుడ్డిగా ఎలాంటి లింక్‌ను క్లిక్ చేయకూడదు.