Telugu Global
Science and Technology

దేశంలో ఎక్కువగా వాడే యాప్స్ ఇవే! ఇంట్రెస్టింగ్ సర్వే!

కొన్ని రీసెంట్ సర్వేల ప్రకారం ఇండియాలోని స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ ఫోన్లలో డీఫాల్ట్‌గా వచ్చే యాప్స్ కాకుండా సుమారు 5 నుంచి 50 అప్లికేషన్ల వరకూ గూగుల్ ప్లే స్టోర్ లేదా ఇతర యాప్ స్టోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటున్నారట.

దేశంలో ఎక్కువగా వాడే యాప్స్ ఇవే! ఇంట్రెస్టింగ్ సర్వే!
X

ప్లే స్టోర్‌‌లో వేల కొద్దీ యాప్స్ అందుబాటులో ఉంటాయి. స్మార్ట్ ఫోన్స్ వాడేవాళ్లు అవసరానికి తగ్గట్టు రకరకాల యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటారు. అయితే మనదేశంలో ఎక్కువమంది వాడుతున్న కామన్ యాప్స్ ఏంటో మీకు తెలుసా?

కొన్ని రీసెంట్ సర్వేల ప్రకారం ఇండియాలోని స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ ఫోన్లలో డీఫాల్ట్‌గా వచ్చే యాప్స్ కాకుండా సుమారు 5 నుంచి 50 అప్లికేషన్ల వరకూ గూగుల్ ప్లే స్టోర్ లేదా ఇతర యాప్ స్టోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటున్నారట. వాటిలో ఏయే యాప్స్ ప్రధానంగా ఉన్నాయంటే..

సగటున ప్రతి ఇండియన్ యూజర్.. తన ఫోన్‌లో 51 మొబైల్ అప్లికేషన్లు కలిగి ఉంటున్నట్లు సర్వేల ద్వారా తెలుస్తోంది. అయితే ఆ 50 అప్లికేషన్లలో కేవలం 24 అప్లికేషన్లు మాత్రమే తరచూ ఉపయోగిస్తున్నారట.

ఇక యాప్స్ కేటగిరీల వివరాల్లోకి వెళ్తే సుమారు 76 శాతం మంది ఎక్కువగా సోషల్ మీడియా అప్లికేషన్లు వాడుతున్నారట. రెండో స్థానంలో మొబైల్ గేమింగ్ అప్లికేషన్లు ఉన్నాయి. సుమారు 70 శాతం మంది ఈ యాప్స్‌ వాడుతున్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ రోజుకి కనీసం ఒకసారైనా మొబైల్ గేమ్ ఆడుతున్నారట. అలాగే 50 శాతం ఉంది బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ వంటి ఫైనాన్షియల్ అప్లికేషన్లు కలిగి ఉంటున్నారు.

ఎక్కువగా వాడుతున్న యాప్స్‌లో ఎంటర్‌‌టైన్‌మెంట్ కేటగిరీ కూడా ఉంది. లైవ్ టీవీ, ఓటీటీ, వీడియో ఆన్ డిమాండ్ వంటి వీడియో కంటెంట్ అప్లికేషన్లను 40 శాతం మంది తప్పనిసరిగా కలిగి ఉంటున్నారు.

ఇకపోతే 10 నుంచి 20 శాతం మంది యుటిలిటీ యాప్స్, లైఫ్‌స్టైల్ యాప్స్ కలిగి ఉన్నారు. పది శాతం మంది షాపింగ్ యాప్స్ వాడుతున్నారు. న్యూస్, వెదర్ రిపోర్ట్స్ వంటి యాప్స్ వాడేవాళ్ల సంఖ్య తక్కువ. ఇక ఎక్కువ యూసేజ్ రేట్ ఉన్న యాప్స్‌లో వాట్సాప్, యూట్యూబ్ ముందువరుసలో ఉన్నాయి. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, గూగుల్ యాప్స్ ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) యాప్స్‌కు క్రమంగా యూజర్లు పెరుగుతుంటే ఫేస్‌బుక్ యాప్‌కు మాత్రం యూజర్లు తగ్గుతున్నారు.

First Published:  29 Jun 2024 1:30 AM GMT
Next Story