ఈ టిప్స్‌తో ఐఫోన్‌లో స్టోరేజ్ పెంచుకోవచ్చు!
iPhone storage | ఐఫోన్స్ వాడేవాళ్లందరికీ స్టోరేజ్ ప్రాబ్లమ్ కామన్. చాలామంది ఐఫోన్ (iPhone) యూజర్లు స్టోరేజ్(storage)ను ఎలా మ్యానేజ్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు.
iPhone storage | ఐఫోన్స్ వాడేవాళ్లందరికీ స్టోరేజ్ ప్రాబ్లమ్ కామన్. చాలామంది ఐఫోన్ (iPhone) యూజర్లు స్టోరేజ్‌ను ఎలా మ్యానేజ్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అయితే కొన్ని సింపుల్ టిప్స్‌తో ఐఫోన్‌లో స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. అదెలాగంటే..
ఐఫోన్ యూజర్లు స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు పెద్ద సైజు ఉన్న ఫైల్స్ డిలీట్ చేస్తుంటారు. అయితే అలా చేసేముందు మొబైల్‌లో ఎక్కువ స్టోరేజ్ ఏ యాప్ తీసుకుంటుందో తెలుసుకుని.. ఆ యాప్ మీడియా, కాచీని డిలీట్ చేస్తే కొంత స్టోరేజ్ ఫ్రీ అవుతుంది.
ఐఫోన్‌లో స్టోరేజ్ ప్రాబ్లమ్ ఉండకూడదంటే.. ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలను క్లౌడ్ స్టోరేజ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలి. అలాగే క్లౌడ్‌లో అవసరం లేని ఫైల్స్‌ను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తుండాలి. కొంత రుసుము చెల్లించి క్లౌడ్‌లో అధిక స్టోరేజీ ఆప్షన్లు కూడా పొందొచ్చు.
వీటితో పాటు ఐఫోన్ ‘డివైజ్ సెట్టింగ్స్’లో ఇంటర్నెట్ బ్రౌజర్ సఫారీలో ఆప్షన్స్ మెను ఓపెన్ చేసి హిస్టరీ, క్యాచీ క్లియర్ చేసుకోవాలి. మెసేజ్ ఆప్షన్స్‌లో ‘కీప్ మెసేజ్’లోకి వెళ్లి, మెసేజ్‌లు ఎన్నిరోజుల వరకూ స్టోర్ చేయాలనుకుంటున్నారో.. టైం లిమిట్ ఇవ్వాలి. తద్వారా పాత మెసేజ్‌లు ఎప్పటికప్పుడు డిలీట్ అవుతుంటాయి. ఫలితంగా కొంత స్టోరేజీ ఫ్రీ అవుతుంటుంది. అలాగే సోషల్ మీడియా యాప్స్ క్యాచీని కూడా ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉండాలి. అవసరమైతే సోషల్ మీడియా యాప్స్‌ను అన్‌ఇన్ స్టాల్ చేసి.. డైరెక్ట్‌గా సైట్స్ యూజ్ చేయడం ద్వారా చాలా స్టోరేజ్ సేవ్ చేయొచ్చు.
ఐఫోన్ లో ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఫొటోలు, మెయిల్స్ వంటివి ఫోన్‌లో ఉంచేబదులు పర్సనల్ పెన్ డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్‌లలో దాచుకోవడం బెటర్. ఇలా చేయడం ద్వారా ఫైల్స్ సేఫ్‌గా ఉంటాయి. అలాగే ఐఫోన్‌లో స్టోరేజ్ కూడా కలిసొస్తుంది.