Telugu Global
Science and Technology

మొబైల్‌లో ఈ మార్పులు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి!

ఫలానా మొబైల్ యూజర్స్ అప్రమత్తంగా ఉండాలని.. ఫలానా మొబైల్‌లో మాల్వేర్ ఎంటరయ్యే అవకాశం ఉందని తరచూ ప్రభుత్వం హెచ్చరిస్తుంటుంది. సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా రకరకాల మార్గాల్లో మొబైల్స్‌ను హ్యాక్ చేయాలని చూడడమే దీనికి కారణం.

మొబైల్‌లో ఈ మార్పులు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి!
X

ఫలానా మొబైల్ యూజర్స్ అప్రమత్తంగా ఉండాలని.. ఫలానా మొబైల్‌లో మాల్వేర్ ఎంటరయ్యే అవకాశం ఉందని తరచూ ప్రభుత్వం హెచ్చరిస్తుంటుంది. సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా రకరకాల మార్గాల్లో మొబైల్స్‌ను హ్యాక్ చేయాలని చూడడమే దీనికి కారణం. మరి ఈ హ్యాకింగ్ బారిన మీరు పడకూడదంటే కొన్ని విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ను దొంగిలించడం కోసం సైబర్‌ నేరగాళ్లు రకరకాల మార్గాలు వెతుకుంటారు. ఇందులో భాగంగానే లింక్‌లు, మెసేజ్‌లు, వైఫై కనెక్షన్, వెబ్‌సైట్లు.. ఇలా ఏదో ఒక రూపంలో మొబైల్‌లోకి మాల్వేర్ సాప్ట్‌వేర్‌ను పంపి ఫోన్‌ను హ్యాక్‌ చేస్తుంటారు. అలా మనకు తెలియకుండానే మన మొబైల్‌లోని సమాచారాన్ని దొంగిలిస్తారు. మీ మొబైల్‌లో ఇలాంటి మాల్వేర్ ఉందో, లేదో ఎలా తెలుసుకోవాలంటే..

మొబైల్‌లో మాల్వేర్ ఉంటే మీరు వాడకుండానే డేటా ఖర్చయిపోతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ డేటా వాడకం మీద ఓ కన్నేసి ఉంచడం ముఖ్యం. వాడకున్న ఎక్కువ డేటా అయిపోతుంటే మాల్వేర్ ఉన్నట్టు అనుమానించొచ్చు.

మొబైల్‌లో మీకు తెలియన్ యాప్‌లు ఇన్‌స్టాల్ అయినట్టు గుర్తిస్తే అది మాల్వేర్ పనిగా అనుమానించొచ్చు. మీ ఫోన్‌లో ఆటోమేటిక్‌గా కొత్త యాప్‌లు ఇన్‌స్టాల్, అన్‌ఇన్‌స్టాల్ అవుతుంటే వెంటనే అలర్ట్ అవ్వాలి.

ఫోన్‌లో ఇంటర్నెట్‌ వాడుతున్నప్పుడు అదేపనిగా పాప్‌అప్ విండోలు ఓపెన్ అవుతుంటే మీ ఫోన్‌లో మాల్వేర్ లేదా స్పైవేర్ సాఫ్ట్‌వేర్లు ఉన్నట్టు అనుమానించొచ్చు. అలాంటి పాపప్‌లు కనిపించినప్పడు వాటిని ఓపెన్ చేయకుండా బ్రౌజర్ క్లోజ్‌ చేసేయాలి.

మొబైల్ నుంచి మీకు తెలియకుండా అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ వెళ్లడం ఇన్‌కమింగ్ కాల్స్ ఒక రింగ్ వచ్చి కట్ అవ్వడం లాంటి యాక్టివిటీస్ గుర్తిస్తే.. అది కచ్చితంగా హ్యాకర్ల పని కావొచ్చు.

ఇక వీటితోపాటు మొబైల్ వాడకపోయినా హీట్ ఎక్కడం, బ్యాటరీ వేగంగా ఖర్చవ్వడం, మొబైల్ స్లో అవ్వడం, హ్యాంగ్ అవ్వడం వంటి లక్షణాలు కూడా మాల్వేర్ అటాక్‌లో భాగమే. ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు వెంటనే అప్రమత్తం అయ్యి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇలా చేయాలి

మొబైల్ హ్యాక్ అయినట్టు లేదా మొబైల్‌లో మాల్వేర్ ఎంటరయినట్టు అనుమానం వస్తే.. వెంటనే మీ డేటాను క్లౌడ్‌లో బ్యాకప్ చేసుకుని ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేసేయాలి. ఇలా చేయడం ద్వారా ఎలాంటి మాల్వేర్ అయినా డిలీట్ అయిపోతుంది.

మొబైల్‌ రీసెట్ చేసిన తర్వాత అన్ని అకౌంట్ల పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలి. జీమెయిల్ అకౌంట్ నుంచి పేమెంట్ యాప్స్, బ్యాంక్ పాస్‌వర్డ్‌లు.. ఇలా అన్నింటినీ వెంటనే మార్చేయాలి.

మొబైల్‌లో మాల్వేర్స్ ఎంటరవ్వకుండా యాంటీ మాల్వేర్ సాఫ్ట్‌వేర్స్ వంటివి వాడడం కూడా కొంత మేలు చేస్తుంది. వాటి సాయంతో తరచూ మొబైల్‌ను స్కాన్ చేయడం ద్వారా అనుమానించదగ్గ యాక్టివిటీలను గుర్తించొచ్చు.

First Published:  13 May 2024 6:00 AM IST
Next Story