HP Envy x360 14 Laptop | విండోస్11తో హెచ్‌పీ ఎన్వీ ఎక్స్360 14 లాప్‌టాప్.. ఇవీ స్పెషిఫికేసన్స్..!
HP Envy x360 14 Laptop | రెండు కలర్ ఆప్షన్లలో వస్తున్న హెచ్‌పీ ఎన్వీ ఎక్స్360 14 (HP Envy x360 14) లాప్‌టాప్ రూ.99,999 పలుకుతుంది.
HP Envy x360 14 Laptop | ప్రముఖ టెక్ కంపెనీ హెచ్‌పీ (HP) భారత్ మార్కెట్లో తన లాప్‌టాప్ హెచ్‌పీ ఎన్వీ ఎక్స్360 (HP Envy x360 14) ఆవిష్కరించింది. న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇంటెల్ కోర్ ఆల్ట్రా సీపీయూ (Intel Core Utra CPU) తో 14-అంగుళాల ఓలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. డెడికేటెడ్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ బటన్‌తో భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తున్న తొలి లాప్‌టాప్ ఇది. విండో11పై మైక్రోసాఫ్ట్ ఏఐ చాట్‌బోట్ వస్తుంది. రెండు కలర్ ఆప్షన్లలో వస్తున్న హెచ్‌పీ ఎన్వీ ఎక్స్360 14 (HP Envy x360 14) లాప్‌టాప్ రూ.99,999 పలుకుతుంది. అట్మోస్పియరిక్ బ్లూ, మీటర్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. కస్టమర్లు హెచ్‌పీ ఆన్‌లైన్ స్టోర్, హెచ్‌పీ వరల్డ్ స్టోర్స్‌లో కొనుగోలు చేయొచ్చు. లాప్‌టాప్ మెమొరీ, స్టోరేజీ వేరియంట్ల వివరాలు వెల్లడించింది. హెచ్‌పీ ఎన్వీ ఎక్స్360 (HP Envy x360 14) కొనుగోలు చేసిన వారికి క్రియేటర్స్ స్లింగ్ బ్యాగ్ (Creators Sling Bag) ఉచితంగా పొందొచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల్లో లభిస్తుంది.
హెచ్‌పీ ఎన్వీ ఎక్స్360 14 (HP Envy x360 14) లాప్‌టాప్ విండోస్ 11 ఔటాఫ్ బాక్స్‌పై పని చేస్తుంది. ఈ లాప్‌టాప్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్‌రేట్‌తో 14-అంగుళాల 2.8కే రిజొల్యూషన్స్ (2,880 x 1,800 పిక్సెల్స్) ఓలెడ్ టచ్‌స్క్రీన్ (ఆప్షనల్‌గా హెచ్‌పీ ఎంపీపీ2.0 టిల్ట్ పెన్ ఇన్‌పుట్) ఉంటుంది. ఇంటెల్ కోర్ ఆల్ట్రా 5 ప్రాసెసర్ 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ కలిగి ఉంటది.
హెచ్‌పీ ఎన్వీ ఎక్స్ 360 14 లాప్‌టాప్ వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, రెండు యూఎస్బీ టైప్-ఏ పోర్ట్స్ కలిగి ఉంటుంది. వీటితోపాటు రెండు యూఎస్బీ టైప్-సీ పోర్ట్స్, హెచ్‌డీఎంఐ 2.1 పోర్ట్, 3.5 మిమీ కాంబో ఆడియో జాక్ కనెక్టివిటీ కలిగి ఉంటది. మాన్యువల్ షట్టర్‌తోపాటు హెచ్‌డీఆర్ మద్దతుతో టెంపోరల్ నాయిస్ రిడక్షన్ సామర్థ్యం గల 5-మెగా పిక్సెల్ కెమెరా కలిగి ఉంటుంది. డ్యుయల్ ఆరే డిజిటల్ మైక్రో పోన్లు, పాలీ స్టూడియోతో ట్యూన్ చేసిన రెండు స్పీకర్లు ఉన్నాయి.
హెచ్‌పీ ఎన్వీ ఎక్స్360 14 లాప్‌టాప్ యాక్సెలరో మీటర్, గైరో స్కోప్, ఐఆర్ థర్మల్ సెన్సర్ తదితర సెన్సర్లు ఉంటాయి. 3-సెల్ 59వాట్ల బ్యాటరీతో వస్తుంది. 30 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది. సింగిల్ చార్జింగ్ అయితే 10.30 గంటల పాటు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. 65వాట్ల యూఎస్బీ టైప్-సీ పవర్ అడాప్టర్ ఉంటుంది.