Telugu Global
Science and Technology

గ్రామీణ ప్రజల కోసం మైక్రోసాఫ్ట్ జుగల్బందీ.. ఎలా పని చేస్తుందంటే..

how to use Jugalbandi: గ్రామాల్లో ఉండేవాళ్ళకు ఇంటర్నెట్ నాలెడ్జ్ అంతగా ఉండకపోవచ్చు. అందుకే అలాంటి వాళ్ళ కోసం మైక్రోసాఫ్ట్ "జుగల్బందీ" అనే వాట్సాప్ టూల్ ని తీసుకొచ్చింది.

How to use Jugalbandi: గ్రామీణ ప్రజల కోసం మైక్రోసాఫ్ట్ జుగల్బందీ.. ఎలా పని చేస్తుందంటే..
X

గ్రామీణ ప్రజల కోసం మైక్రోసాఫ్ట్ జుగల్బందీ.. ఎలా పని చేస్తుందంటే..

సిటీల్లో ఉండేవాళ్ళు ఇంగ్లిష్ తెలిసిన వాళ్ళు ఆన్ లైన్ లో దేని గురించి అయినా ఇట్టే వెతికేస్తారు. అయితే గ్రామాల్లో ఉండేవాళ్ళకు ఇంటర్నెట్ నాలెడ్జ్ అంతగా ఉండకపోవచ్చు. అందుకే అలాంటి వాళ్ళ కోసం మైక్రోసాఫ్ట్ "జుగల్బందీ" అనే వాట్సాప్ టూల్ ని తీసుకొచ్చింది. ఇది ఎలా పని చేస్తుందంటే..

ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు లాంటి వాటికి సంబంధించి ఎన్నెన్నో వెబ్‌సైట్లు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే గ్రామాల్లో ఉండే ప్రజలకు, చదువుకొని వాళ్లకు, ఇంగ్లిష్‌ తెలియనివారికి వాటి గురించి అంతగా తెలియదు.

పైగా మనదేశం లో వందల కొద్దీ ప్రాంతీయ భాషలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వాళ్లకు తెలిసిన భాషలో సమాచారాన్ని పొందటం కష్టమైన పనే. అందుకే మైక్రోసాఫ్ట్‌ "జుగల్బందీ" అనే సరికొత్త వాట్సప్‌ ఛాట్‌బాట్‌ను తీసుకొచ్చింది.

గ్రామీణ ప్రజలకు, రైతులకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని తేలికగా అందించడమే దీని ఉద్దేశం. ఛాట్‌జీపీటీ తరహాలోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే టూల్ ఇది.

ఈ టూల్ పలు భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. యూజర్లు అడిగిన ప్రశ్నలకు వాళ్ళ భాషలోనే మెరుగైన సమాధానాలు ఇస్తుంది. జుగల్బందీ టూల్ ద్వారా వాట్సాప్ నంబరుకు టెక్స్ట్‌ లేదా ఆడియో మెసేజ్ పంపితే చాలు.

"ఏఐ4భారత్‌" స్పీచ్‌ రికగ్నిషన్‌ మోడల్‌ సాయంతో ప్రతి మెసేజ్ ని ట్రాన్స్‌లేషన్‌ మోడల్‌తో ఇంగ్లిష్‌లోకి ట్రాన్సలేట్ చేసుకుంటుంది. అడిగిన విషయాన్ని బట్టి ప్రభుత్వ పథకాల సమాచారాన్ని సేకరించి తగిన వివరాలు అందిస్తుంది. ప్రతి విషయాన్నీ యూజర్లు అడిగిన భాషల్లోకి అనువదించి చూపిస్తుంది. అవసరమైతే సందేశాన్ని వాయిస్ రూపంలోకి కూడా మార్చి వినిపిస్తుంది.

తొలిదశ లోనే ఈ టూల్ మంచి రిజల్ట్స్ ను ఇస్తుందని డెవలపర్లు చెప్తున్నారు. అయితే ఇది ప్రస్తుతం 22 భారతీయ భాషలను మాత్రమే సపోర్ట్ చేస్తోంది. సుమారు 170 పథకాలకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్ రూపంలో అందిస్తుంది. త్వరలోనే ఇది మిగతా అన్ని భాషల్లో కూడా అందుబాటులోకి వస్తుంది.

First Published:  10 Jun 2023 2:21 PM IST
Next Story