ఫోన్ లాక్ మర్చిపోతే.. ఇలా చేయెచ్చు!
చాలామంది తమ మొబైల్‌కు లాక్ స్క్రీన్ సెట్ చేసుకుంటారు. ఫోన్ కు లాక్ పెట్టుకోవడం వల్ల ఇతరులు ఫోన్‌ను ఓపెన్ చేయడానికి వీలుండదు.

ఫోన్ లాక్ మర్చిపోతే.. ఇలా చేయెచ్చు!
చాలామంది తమ మొబైల్‌కు లాక్ స్క్రీన్ సెట్ చేసుకుంటారు. ఫోన్ కు లాక్ పెట్టుకోవడం వల్ల ఇతరులు ఫోన్‌ను ఓపెన్ చేయడానికి వీలుండదు. అయితే ఎప్పుడైనా పిన్ నంబర్ లేదా ప్యాటర్న్ మరచిపోతే? ఫేస్ ఐడీ లేదా ఫింగర్ ప్రింట్ సరిగా పనిచేయకపోతే? అప్పుడు ఫోన్‌ను అన్‌లాక్ చేయటం ఎలా?
ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండే ‘ఫైండ్ మై డివైజ్’ అనే ఫీచర్ ద్వారా మొబైల్ పోయినప్పుడు లేదా లాక్ స్క్రీన్ పాస్‌వర్డ్ మర్చిపోయినప్పుడు, ఫింగర్ ప్రింట్ సెన్సర్ పనిచేయనప్పుడు మొబైల్‌ను రిమోట్‌గా అన్‌లాక్ చేయొచ్చు. ముందుగా డెస్క్‌టాప్ లేదా ల్యాప్ టాప్‌లో ‘గూగుల్ ఫైండ్ మై డివైజ్’ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
లాక్ అయిన ఫోన్‌కు లింక్ అయి ఉన్న గూగుల్ అకౌంట్‌తో సైన్‌ఇన్ కావాలి. అప్పుడు గూగుల్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న మొబైల్స్ లిస్ట్ కనిపిస్తుంది. లాక్ అయిన ఫోన్ పేరు మీద క్లిక్ చేయాలి. ‘లాక్’ ఆప్షన్ నొక్కాలి. టెంపరరీ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి.. ‘లాక్’ బటన్‌ను నొక్కితే.. రింగ్, లాక్, ఎరేజ్ అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో లాక్‌ను ఎంచుకోవాలి. తర్వాత టెంపరరీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి.
ఇప్పుడు లాక్ అయిన ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఆ టెంపరరీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేస్తే చాలు. ఫోన్ అన్‌లాక్ అవుతుంది. అయితే ఈ ఫీచర్ పనిచేయాలంటే మొబైల్‌లో గూగుల్ ఫైండ్ మై డివైజ్ ఎనేబుల్ చేసి ఉండాలి. అన్‌లాక్ చేయాలనుకుంటున్న ఫోన్‌లో ఇంటర్నెట్ ఆన్ చేసి ఉండాలి. అప్పుడే అన్ లాక్ సాధ్యమవుతుంది.