Telugu Global
Science and Technology

విసిగించే స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టండిలా!

స్పామ్‌ కాల్స్‌ వల్ల విసుగు పుట్టడమే కాకుండా స్కామ్‌ల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా వీటికి అడ్డుకట్ట వేయాలి. గూగుల్ డయల్, ట్రూ కాలర్ యాప్స్ సాయంతో వీటిని బ్లాక్ చేయొచ్చు.

విసిగించే స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టండిలా!
X

సమయం, సందర్భం లేకుండా రోజులో ఎప్పుడు పడితే అప్పుడు స్పామ్ కాల్స్ వస్తుంటాయి. వీటిలో మార్కెటింగ్ కాల్స్ కొన్ని అయితే ఫిషింగ్ స్కామ్ కాల్స్ మరికొన్ని. వీటితో ఇబ్బంది పడేవాళ్లు కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా వీటికి చెక్ పెట్టొచ్చు. అదెలాగంటే..

స్పామ్‌ కాల్స్‌ వల్ల విసుగు పుట్టడమే కాకుండా స్కామ్‌ల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా వీటికి అడ్డుకట్ట వేయాలి. గూగుల్ డయల్, ట్రూ కాలర్ యాప్స్ సాయంతో వీటిని బ్లాక్ చేయొచ్చు.

గూగుల్ డయలర్

ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో గూగుల్ డయలర్‌‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా స్పామ్‌ కాల్స్‌ను అడ్డుకోవచ్చు. ముందుగా గూగుల్ డయలర్‌‌ను ఇన్‌స్టాల్ చేసి తర్వాత దాన్ని డీఫాల్ట్‌ డయలర్‌గా సెట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్‌లో పైన కనిపించే త్రీ డాట్స్‌పై క్లిక్ చేసి మెనూలోకి వెళ్లాలి. అక్కడ సెటింగ్స్‌లో ‘కాలర్‌ ఐడీ అండ్‌ స్పామ్‌’పై క్లి్క్ చేస్తే.. ‘ఎనేబుల్‌ ఫిల్టర్‌ స్పామ్‌ కాల్స్‌’ అనే ఆప్షన్‌ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఆటోమేటెడ్ స్పామ్ కాల్స్ బ్లాక్ అయిపోతాయి.

బ్లాక్ లిస్ట్

ట్రూ కాలర్ యాప్ ద్వారా స్పెసిఫిక్ నెంబర్ సిరీస్‌లను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేయొచ్చు. ట్రూ కాలర్ సెట్టింగ్స్‌లో బ్లాకింగ్‌లోకి వెళ్లి మేనేజ్ బ్లా్క్ లిస్ట్‌లోకి వెళ్లాలి. అక్కడ ఇంటర్నేషనల్ కంట్రీ కోడ్స్, స్టార్టింగ్ నెంబర్స్, సిమిలర్ నెంబర్స్.. ఇలా తరచుగా వచ్చే స్పామ్ కాల్స్ నెంబర్స్‌ను లిస్ట్ చేసి బ్లాక్ చేయొచ్చు.

మెసేజ్ ద్వారా..

మొబైల్ ఫోన్‌లో మెసేజ్ యాప్‌లోకి వెళ్లి అక్కడ ‘ఫుల్లీ బ్లాక్ (FULLY BLOCK)’ అని మెసేజ్ టైప్ చేసి దాన్ని 1909 నెంబర్‌‌కు సెండ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా టెలీ మార్కెటింగ్ కాల్స్ ఆటోమేటిక్‌గా బ్లాక్ అవుతాయి.

సిమ్ సెట్టింగ్స్

ఇకపోతే ఎయిర్‌‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా సిమ్స్ వాడేవాళ్లు ఆయా నెట్‌వర్క్ యాప్స్‌లోకి వెళ్లి సెట్టింగ్స్ లేదా సర్వీసెస్‌లోకి వెళ్లి ‘డీఎన్‌డీ(DND)’ ఆప్షన్‌ను వెతకాలి. దాన్ని ఎనేబుల్ చేయడం ద్వారా కూడా స్పామ్ కాల్స్‌ను అడ్డుకోవచ్చు.

వీటితోపాటు షాపింగ్ మాల్స్, ఆన్‌లైన్ సైట్స్‌లో ఎక్కడపడితే అక్కడ మీ మొబైల్ నెంబర్‌‌ను ఎంటర్ చేయడం మానుకోవాలి. మీ మొబైల్ నెంబర్ ఎంత ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయితే స్పామ్ కాల్స్ బెడద అంత ఎక్కువగా ఉంటుంది.

First Published:  18 July 2024 12:30 AM GMT
Next Story