Telugu Global
Science and Technology

ఉచితంగా వైరస్‌ను పోగొట్టే మార్గాలివే..

ల్యాప్ టాప్, కంప్యూటర్‌లు వాడేవాళ్లకు వైరస్‌ అనేది పెద్ద ప్రాబ్లమ్. ఎప్పుడు ఏ సైట్ నుంచి మాల్వేర్ ఎంటర్ అవుతుందో తెలియని పరిస్థితి. అందులోనూ మాల్వేర్, ర్యాన్సమ్‌వేర్ ఎటాక్‌లు ఈమధ్య కాలంలో బాగా పెరిగాయి.

ఉచితంగా వైరస్‌ను పోగొట్టే మార్గాలివే..
X

ఉచితంగా వైరస్‌ను పోగొట్టే మార్గాలివే..

ల్యాప్ టాప్, కంప్యూటర్‌లు వాడేవాళ్లకు వైరస్‌ అనేది పెద్ద ప్రాబ్లమ్. ఎప్పుడు ఏ సైట్ నుంచి మాల్వేర్ ఎంటర్ అవుతుందో తెలియని పరిస్థితి. అందులోనూ మాల్వేర్, ర్యాన్సమ్‌వేర్ ఎటాక్‌లు ఈమధ్య కాలంలో బాగా పెరిగాయి. వీటికి చెక్ పెట్టాలంటే పీసీలో సమర్ధవంతమైన యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ ఉండాలి. అయితే వీటి ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. మరి ఉచితంగా వైరస్ పని పట్టేదెలా?

పీసీలోకి ఏదైనా వైరస్ చొరబడిందంటే అది ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను దెబ్బతీయడమేకాకుండా ముఖ్యమైన ఫైళ్లు, డేటాను కూడా పాడుచేస్తుంది. ఇలా జరగకుండా చూసుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. అవేంటంటే.

డిఫెండర్‌ ఫైర్‌‌వాల్

విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వాడేవాళ్లకు ఓఎస్‌లో ఇన్‌బిల్ట్‌గా ‘విండోస్ డిఫెండర్ ఫైర్‌‌వాల్’ అనే టూల్ ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు మాల్వేర్‌లు, వైరస్‌ల నుంచి పీసీని కాపాడుతూ ఉంటుంది. విండోస్ బటన్‌ నొక్కి, సెర్చ్ బాక్స్ లో ‘డిఫెండర్’ అని టైప్‌ చేస్తే.. డిఫెండర్ టూల్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి అక్కడ ‘వైరస్‌ అండ్‌ థ్రెట్‌ ప్రొటెక్షన్‌’ లోకి వెళ్లాలి. అక్కడ సెటింగ్స్‌లోకి వెళ్లి ‘మేనేజ్‌ సెటింగ్స్‌’ లో ‘రియల్‌-టైమ్‌ ప్రొటెక్షన్‌’ ఆప్షన్‌ను ఆన్‌ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా డిఫెండర్ టూల్ ఎప్పటికప్పుడు పీసీని స్కాన్ చేస్తూ ఉంటుంది.

డిస్క్ క్లీనప్

పీసీలో చొరబడిన చిన్నచిన్న వైరస్‌లు క్యాచీ ఫైల్స్ లేదా టెంపరరీ ఫైల్స్‌లో దాక్కుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు పీసీని క్లీన్ చేస్తుండడం ద్వరా వైరస్‌లు లేకుండా చూసుకోవచ్చు. దీనీకోసం విండోస్ బటన్ నొక్కి సెర్చ్ బాక్స్‌లో ‘డిస్క్ క్లీనప్’ అని టైప్ చేస్తే.. ఒక టూల్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి అన్ని డ్రైవ్ లను సెలక్ట్ చేసి ‘ఓకే’ నొక్కుతూ వెళ్లాలి. తర్వాత రీస్టార్ట్ చేస్తే టెంపరరీ ఫైల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇలా రెండ్రోజులకోసారి చేయొచ్చు.

డిజేబుల్ పర్మిషన్స్

వైరస్ లేదా మాల్వేర్‌‌లు ఎక్కువగా ఎంటర్ అయ్యేది బ్రౌజర్ నుంచే. కాబట్టి బ్రౌజర్‌‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలి. అలాగే బ్రౌజర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘ప్రైవసీ అండ్ సెక్యూరిటీ’లో.. ‘సైట్ సెట్టింగ్స్’లోకి వెళ్లి పర్మిషన్స్, నోటిఫికేషన్స్ వంటివి ఏయే సైట్స్‌కు ఇచ్చారో సరిచూసుకోవాలి. అనుమానిత వెబ్‌సైట్లు ఏవైనా ఉంటే వెంటనే పర్మిషన్లు డిజేబుల్ చేయాలి.

ఇకవీటితో పాటు పీసీకి ఇతర పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు కనెక్ట్ చేయకుండా చూసుకోవడం, ట్రస్టెడ్ వైఫై వాడడం, ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లోకి వైరస్ చొరబడకుండా ఉంటుంది.

First Published:  30 Oct 2023 9:00 AM IST
Next Story