యూట్యూబ్ ఛానెల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోండి!
యూట్యూబ్ ఛానెల్‌ని క్రియేట్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. మీకు గూగుల్ అకౌంట్ ఉంటే చాలు. మూడు స్టెప్స్‌లో యూట్యుబ్ ఛానెల్ రెడీ.
సొంత యూట్యూబ్ ఛానెల్‌ని క్రియేట్ చేయాలని చాలామందికి అనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఉన్న బెస్ట్ వీడియో కంటెంట్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్. మీలో క్రియేటివిటీ, కష్టపడే తత్వం ఉంటే యూట్యుబ్‌లో ఈజీగా సక్సెస్ అవ్వొచ్చు. దీనికోసం ఎలా ప్లాన్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం.
యూట్యూబ్ ఛానెల్‌ని క్రియేట్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. మీకు గూగుల్ అకౌంట్ ఉంటే చాలు. మూడు స్టెప్స్‌లో యూట్యుబ్ ఛానెల్ రెడీ.
ముందుగా యూట్యుబ్ సైట్‌లోకి వెళ్లి కుడి వైపున పైన ఉన్న ‘సైన్ ఇన్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మీ గూగుల్ అకౌంట్/ జీమెయిల్ ఐడీతో లాగిన్ అయితే మీ యూట్యూబ్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ప్రొఫైల్ పిక్‌పై క్లిక్ చేస్తే ‘క్రియేట్ ఛానెల్’ అని కనిపిస్తుంది. అక్కడ ఛానెల్ నేమ్, కేటగిరీ వంటి డీటెయిల్స్ ఇస్తే ఛానెల్ రెడీ అవుతుంది.
అయితే ఛానెల్ క్రియేట్ చేయడంతో అయిపోలేదు. ఛానెల్‌ని కస్టమైజ్ చేయడం కూడా ముఖ్యమే. ఛానెల్ క్రియేట్ అయిన తర్వాత మీకు ‘కస్టమైజ్ ఛానెల్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ఛానెల్ కోసం ఒక ఇంట్రడక్షన్ వీడియో, కవర్ ఫోటో, ప్రొఫైల్ ఫొటో వంటివి పెట్టుకోవచ్చు. అలాగే మీ ఛానెల్ గురించి బేసిక్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేస్తే మంచిది. ఇదంతా పూర్తయిన తర్వాత పైన కనిపించే కెమెరా సింబల్ మీద నొక్కి వీడియో అప్‌లోడ్ చేస్తే మీ యూట్యూబ్ ఛానెల్‌లో మొదటి వీడియో అప్‌లోడ్ అవుతుంది.
ఇక యూట్యూబ్‌లో తరచూ వీడియోలు పెట్టడం మొదలైన తర్వాత ‘యూట్యూబ్ స్టూడియో’ని వాడడం నేర్చుకోవాలి. అక్కడ ‘మ్యానేజ్ వీడియోస్’ ఆప్షన్‌లోకి వెళ్తే మీ వీడియోల లిస్ట్ కనిపిస్తుంది. వాటిపై ఎడిట్ నొక్కి మార్పులు చేసుకోవచ్చు. అక్కడే వీడియో వ్యూస్ వివరాలు కనిపిస్తాయి. ఇవన్నీ బేసిక్ విషయాలు. ఇంకా యూట్యూబ్‌లో తెలుసుకోవాల్సినవి చాలానే ఉంటాయి.
యూట్యూబ్ స్టూడియోలో మరిన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా ఉంటాయి. ఛానెల్‌లో కంటెంట్ పెరుగుతున్న కొద్దీ వాటిని ఎలా మ్యానేజ్ చేయాలి? స్టాటిస్టిక్స్ ఎలా చూసుకోవాలి? వంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవాలి. వీటితోపాటు యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ ట్యాబ్.. ఇలా యూట్యూబ్‌లో ఎక్స్‌ప్లోర్ చేయాల్సినవి చాలానే ఉన్నాయి. దీనికోసం గూగుల్ డిజిటల్ గ్యారేజ్‌లో ఉండే డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీ కోర్సు పూర్తి చేయొచ్చు.