Telugu Global
Science and Technology

వైఫై ఎవరు వాడుతున్నారో ఇలా తెలుసుకోండి!

ఉన్నట్టుండి వైఫై స్పీడ్ తగ్గిపోతే కనెక్షన్ లోపం అనుకుంటారు చాలామంది. కానీ, వైఫై స్పీడ్ తగ్గడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైంది ఒకే వైఫైని ఎక్కువమంది కనెక్ట్ చేసుకోవడం. కొన్ని యాప్స్ ద్వారా పాస్‌వర్డ్‌ హ్యాక్ చేసి లేదా ఎప్పుడో అడిగి తీసుకుని.. ఇలా చాలామంది మనకు తెలియకుండా వైఫైకు కనెక్ట్ అవుతుంటారు.

వైఫై ఎవరు వాడుతున్నారో ఇలా తెలుసుకోండి!
X

ఉన్నట్టుండి వైఫై స్పీడ్ తగ్గిపోతే కనెక్షన్ లోపం అనుకుంటారు చాలామంది. కానీ, వైఫై స్పీడ్ తగ్గడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైంది ఒకే వైఫైని ఎక్కువమంది కనెక్ట్ చేసుకోవడం. కొన్ని యాప్స్ ద్వారా పాస్‌వర్డ్‌ హ్యాక్ చేసి లేదా ఎప్పుడో అడిగి తీసుకుని.. ఇలా చాలామంది మనకు తెలియకుండా వైఫైకు కనెక్ట్ అవుతుంటారు. దీనివల్ల ఆటోమెటిక్‌గా ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుంది. మన వైఫైను ఇతరులు వాడకుండా సేఫ్‌గా ఎలా ఉంచుకోవాలంటే..

ముందుగా సిస్టమ్‌లో విండోస్ + ఆర్(R) నొక్కి, అక్కడ ‘సీఎండీ(cmd)’ అని టైప్ చేయాలి. అప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడ ‘ipconfig/all’ అని ఎంటర్ చేస్తే.. ఒక లిస్ట్ వస్తుంది. అక్కడ ‘డిఫాల్ట్‌ గేట్‌వే’ పక్కన రూటర్‌ ఐపీ అడ్రస్‌ కనిపిస్తుంది.

ఆ అడ్రస్‌ను వెబ్ బ్రౌజర్‌‌లో ఎంటర్ చేయాలి. తర్వాత యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్ ఎంటర్‌ చేసి, వైఫై రూటర్‌లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత ‘క్లైంట్స్ లిస్ట్ లేదా ‘కనెక్టెడ్ డివైజ్’లను సెర్చ్ చేయాలి. అప్పుడు రూటర్‌‌కు కనెక్ట్ అయిన కనెక్షన్లు కనిపిస్తాయి.

అందులో మీవి కాని వాటిని రిమూవ్ లేదా బ్లాక్ చేయొచ్చు. అలాగే రూటర్‌ లాగిన్‌ డిటెయిల్స్‌ను అప్పుడప్పుడూ మారుస్తూ ఉండడం వల్ల వేరేవాళ్లు కనెక్ట్ చేసుకుని ఉంటే అవన్నీ డిజేబుల్ అవుతాయి. దీంతోపాటు వైఫై పాస్‌వర్డ్‌లో ఆల్ఫాబెట్ అక్షరాలతో పాటు నెంబర్స్, సింబల్స్ లాంటివి పెట్టుకోవడం ద్వారా పాస్‌వర్డ్‌ హ్యాక్ చేయడం కష్టమవుతుంది.

First Published:  25 March 2023 5:45 AM GMT
Next Story