Telugu Global
Science and Technology

Honor X9b | రేపు దేశీయ మార్కెట్‌లోకి మీడియం రేంజ్‌ హాన‌ర్ ఎక్స్‌9బీ ఫోన్ ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ డిటైల్స్‌..

Honor X9b | హాన‌ర్ ఎక్స్‌9బీ (Honor X9b) ఫోన్ సింగిల్ చార్జింగ్‌తో 5800 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో 19 గంట‌ల వీడియో ప్లేబ్యాక్‌, 12 గంట‌ల గేమింగ్ చేయొచ్చు.

Honor X9b | రేపు దేశీయ మార్కెట్‌లోకి మీడియం రేంజ్‌ హాన‌ర్ ఎక్స్‌9బీ ఫోన్ ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ డిటైల్స్‌..
X

Honor X9b | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ హాన‌ర్ త‌న మిడ్ రేంజ్ ఫోన్‌.. హాన‌ర్ ఎక్స్‌9బీ 5జీ (Honor X9b) ఫోన్ ఈ నెల 15న భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించ‌నున్న‌ది. దీంతోపాటు వైర్‌లెస్ ఇయ‌ర్‌బ‌డ్స్ ఎక్స్5, స్మార్ట్ వాచ్ హాన‌ర్ చాయిస్ వాచ్‌ కూడా మార్కెట్లో ఆవిష్క‌రిస్తుంది. వీటిని ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా విక్ర‌యించ‌నున్న‌ది. హాన‌ర్ ఎక్స్‌9బీ ఫోన్ 108-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా (108-megapixel primary camera), 5800 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ, క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 8 జెన్ 1 ప్రాసెస‌ర్ (Qualcomm Snapdragon 6 Gen 1 processor) తో వ‌స్తున్న‌ది. డీఎక్స్ఓ మార్క్ నుంచి గోల్డ్ లేబుల్ రిక‌గ్నిష‌న్ (Gold Label recognition) పొందింది.

హాన‌ర్ ఎక్స్‌9బీ (Honor X9b) ఫోన్ సింగిల్ చార్జింగ్‌తో 5800 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో 19 గంట‌ల వీడియో ప్లేబ్యాక్‌, 12 గంట‌ల గేమింగ్ చేయొచ్చు. క్లాసిక‌ల్ డ్యుయ‌ల్ రింగ్ కెమెరా మాడ్యూల్ (Classical Dual Ring camera)తో వ‌స్తుంది హాన‌ర్ ఎక్స్‌9బీ (Honor X9b). మిడ్ నైట్ బ్లాక్, స‌న్ రైజ్ ఆరెంజ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ మ్యాజిక్ ఓఎస్ 7.2 ఓఎస్ వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. త‌దుప‌రి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అందిస్తుంది.

హాన‌ర్ ఎక్స్‌9బీ ఫోన్ 108-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరాతో కూడిన‌ ట్రిపుల్ కెమెరా సిస్ట‌మ్ ఉంటుంది. 5-మెగా పిక్సెల్ సెన్స‌ర్ విత్ ఆల్ట్రావైడ్ లెన్స్‌, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్స‌ర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటుంది. 4ఎన్ఎం క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 6 జెన్ 1 ఎస్వోసీ ప్రాసెస‌ర్‌తో వ‌స్తున్న ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ క‌లిగి ఉంటుంది. వ‌ర్చువ‌ల్‌గా దీని ర్యామ్ మ‌రో 8 జీబీ పెంచుకోవ‌చ్చు. హాన‌ర్ డాక్ షూట్ (HONOR Doc suite)తో వ‌స్తుంది. ఇది ఎడిటింగ్ టెక్ట్స్ డాక్యుమెంట్లు, ప్రెజెంటేష‌న్లు, స్ప్రెడ్ షీట్లు క్రియేట్ చేస్తుంది. ఈ ఫోన్ ధ‌ర రూ.35 వేల‌లోపు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇలా హాన‌ర్ చాయిస్ వాచ్

గురువారం హాన‌ర్ న్యూ స్మార్ట్ వాచ్ హాన‌ర్ చాయిస్ వాచ్ ఆవిష్క‌రిస్తార‌ని తెలుస్తున్న‌ది. 1.95 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. సింగిల్ చార్జింగ్‌తో 12 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ లైఫ్ ఉంటుంది. బిల్ట్ ఇన్ జీపీఎస్‌, వ‌న్ క్లిక్ ఎస్వోఎస్ కాలింగ్‌, 120 వ‌ర్కౌట్ మోడ్స్‌లో వ‌స్తుంది.

First Published:  14 Feb 2024 4:33 PM IST
Next Story