Telugu Global
Science and Technology

Honor Magic 6 Pro 5G | 108 ఎంపీ పెరిస్కోప్ కెమెరాతో హాన‌ర్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ హాన‌ర్ మ్యాజిక్ 6ప్రో 5జీ ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ డిటైల్స్‌..!

Honor Magic 6 Pro 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ హాన‌ర్ (Honor) త‌న ప్రీమియం ఫోన్ హాన‌ర్ మ్యాజిక్ 6 ప్రో 5జీ (Honor Magic 6 Pro 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

Honor Magic 6 Pro 5G | 108 ఎంపీ పెరిస్కోప్ కెమెరాతో హాన‌ర్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ హాన‌ర్ మ్యాజిక్ 6ప్రో 5జీ ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ డిటైల్స్‌..!
X

Honor Magic 6 Pro 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ హాన‌ర్ (Honor) త‌న ప్రీమియం ఫోన్ హాన‌ర్ మ్యాజిక్ 6 ప్రో 5జీ (Honor Magic 6 Pro 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది. హాన‌ర్ (Honor) ఫ్లాగ్‌షిప్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 3 ఎస్వోసీ (Qualcomm Snapdragon 8 Gen 3 SoC) ప్రాసెస‌ర్‌, 6.8-అంగుళాల ఎల్‌టీపీఓ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. 108 మెగా పిక్సెల్ పెరిస్కోప్ మెయిన్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్ ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్స్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది.

హాన‌ర్ మ్యాజిక్ 6 ప్రో 5జీ (Honor Magic 6 Pro 5G) ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.89,999 ప‌లుకుతుంది. ఈ ఫోన్ బ్లాక్‌, ఎపి గ్రీన్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌, ఎక్స్‌ప్లోర్‌హాన‌ర్ డాట్‌కామ్‌, దేశంలోని అన్ని రిటైల్ స్టోర్ల‌లో అందుబాటులో ఉందీ ఫోన్‌. సెలెక్టెడ్ బ్యాంకు కార్డుల‌పై రూ.7,500 చొప్పున 12 నెల‌ల వ‌ర‌కూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్ష‌న్ అందుబాటులో ఉంది. అలాగే వ‌చ్చే 180 రోజులూ ధ‌ర త‌గ్గింపు యోచ‌నే లేద‌ని హాన‌ర్ తేల్చి చెప్పింది.

హాన‌ర్ మ్యాజిక్ 6ప్రో 5జీ (Honor Magic 6 Pro 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ మ్యాజిక్ ఓఎస్ 8.0 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. 93.20 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో ప్ర‌కారం 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.8-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,280x2,800 పిక్సెల్స్‌) క్వాడ్ క‌ర్వ్‌డ్ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. 5000 నిట్స్ వ‌ర‌కూ గ‌రిష్టంగా హెచ్‌డీఆర్ బ్రైట్‌నెస్ ఉంటుంది. పీడ‌బ్ల్యూఎం డిమ్మింగ్ ఫ్రీక్వెన్సీ 4320 హెర్ట్జ్ ఉంట‌ది. ప్ర‌మాద‌వ‌శాత్తు కింద ప‌డినా ఫోన్ దెబ్బ తిన‌కుండా 10ఎక్స్ ట‌ఫ్‌నెస్ ప్రొటెక్ష‌న్ కోసం హాన‌ర్ త‌యారు చేసిన నానో క్రిస్ట‌ల్ షీల్డ్ జ‌త చేశారు.

హాన‌ర్ మ్యాజిక్ 6ప్రో 5జీ (Honor Magic 6 Pro 5G) ఫోన్ 4ఎన్ఎం స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ ఎస్వోసీ (4nm Snapdragon 8 Gen 3 SoC) ప్రాసెస‌ర్‌, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్‌గా అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లో 108-మెగా పిక్సెల్ 2.5ఎక్స్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా విత్ ఓఐఎస్ స‌పోర్ట్ అండ్ 100 ఎక్స్ డిజిట‌ల్ జూమ్, 50-మెగా పిక్సెల్ హెచ్‌9000 హెచ్‌డీఆర్ కెమెరా, 50-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 3డీ డెప్త్ సెన్సింగ్‌తో 50-మెగా పిక్సెల్ కెమెరా ఉన్నాయి.

హాన‌ర్ మ్యాజిక్ 6 ప్రో 5జీ (Honor Magic 6 Pro 5G) ఫోన్ 5జీ, వై-ఫై, బ్లూటూత్‌, జీపీఎస్‌/ఏ జీపీఎస్‌, గెలీలియో, బైదూ, ఓటీజీ, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది. వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 68 రేటింగ్ క‌లిగి ఉంటుంది. రేర్ అండ్ సెల్ఫీ కెమెరాల కోసం, బ్యాట‌రీ పెర్ఫార్మెన్స్‌, డిస్‌ప్లే, ఆడియో ఎక్స్‌పీరియ‌న్స్ కోసం ఫైవ్ డీఎక్స్ఓ మార్క్ గోల్డ్ లేబుల్స్ ఉంటాయి.

హాన‌ర్ మ్యాజిక్ 6ప్రో 5జీ (Honor Magic 6 Pro 5G) ఫోన్ 80 వాట్ల వైర్డ్ చార్జింగ్‌, 66 వాట్ల వైర్‌లెస్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5,600 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ వ‌స్తోంది. హాన‌ర్ ఈ1 ప‌వ‌ర్ ఎన్‌హాన్స్‌మెంట్ చిప్ కూడా జ‌త చేశారు. దీనివ‌ల్ల త‌క్కువ ఉష్ణోగ్ర‌త వాతావ‌ర‌ణం ఉన్న‌ప్పుడు కూడా ఫోన్‌, బ్యాట‌రీ స‌రిగ్గా ప‌ని చేస్తాయి. ఫోన్ బ్యాట‌రీ పూర్తిగా చార్జింగ్ చేయ‌డానికి 40 నిమిషాల టైం ప‌డుతుంది.

First Published:  3 Aug 2024 11:27 AM IST
Next Story