కొత్త ఫీచర్లతో నోకియా వింటేజ్ ఫోన్లు! ప్రత్యేకతలివే..
వింటేజ్ మోడల్స్‌ను తలపిస్తూ సరికొత్త ఫీచర్ ఫోన్లను లాంఛ్ చేసింది నోకియా. నోకియా 3210, నోకియా 235, నోకియా 220 పేర్లతో ఈ ఫోన్లు రీసెంట్‌గా మార్కెట్లోకి వచ్చాయి.
మొబైల్ మార్కెట్లో ఒకప్పుడు నోకియా సృష్టించిన ట్రెండ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మొదటితరం నోకియా ఫీచర్లు ఫోన్లు చాలా పాపులర్. అయితే ఇప్పుడు మళ్లీ ఆ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. కొత్తగా అప్‌డేట్ అయిన ఈ ఫోన్లలో ఎలాంటి ఫీచర్లున్నాయంటే.
వింటేజ్ మోడల్స్‌ను తలపిస్తూ సరికొత్త ఫీచర్ ఫోన్లను లాంఛ్ చేసింది నోకియా. నోకియా 3210, నోకియా 235, నోకియా 220 పేర్లతో ఈ ఫోన్లు రీసెంట్‌గా మార్కెట్లోకి వచ్చాయి. సుమారు పాతికేళ్ల క్రితం వచ్చిన మోడల్స్‌ను రీక్రియేట్ చేస్తూ ఈ ఫోన్స్‌ను డిజైన్ చేసింది నోకియా సంస్థ. అలాగే ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా వీటిలో లేటెస్ట్ ఫీచర్లను కూడా తీసుకొచ్చింది.
ఈ బుల్లి నోకియా ఫోన్లు 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి. ఫోన్లలో వెనుక 2 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్లాష్ లైట్ ఉంటాయి. ఈ కెమెరా సాయంతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పేమెంట్స్ చేసే వెసులుబాటు కూడా ఉంది. అలాగే ఈ ఫోన్లలో యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్ వంటి యాప్స్ కూడా ప్రీలోడ్ అయ్యి ఉంటాయి.
ఈ నోకియా ఫీచర్ ఫోన్లలో.. 2.8 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, 2 మెగా పిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఇవి యూనిసాక్ టీ107 ప్రాసెసర్ పై పనిచేస్తాయి. 64ఎంబీ ర్యామ్ 128ఎంబీ స్టోరేజీతో వస్తాయి. మైక్రో ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ ఉంది. వీటిలో అమర్చిన 1,450ఎంఏహెచ్ బ్యాటరీ 9 గంటల టాక్ టైమ్‌ను అందిస్తుంది.
నోకియా ఫీచర్ ఫోన్స్‌లో బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్–సీ ఛార్జింగ్ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఎంపీ3 ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, క్లౌడ్ యాప్స్, న్యూస్, వెదర్ రిపోర్ట్ యాప్స్, క్లాసిక్ నోకియా స్నేక్ గేమ్ , యూట్యూబ్ యాప్, యూపీఐ యాప్ వంటి ఫీచర్లున్నాయి. (నోకియా 220 ఫోన్‌లో కెమెరా ఆప్షన్ ఉండదు)
ఇక ధరల విషయానికొస్తే.. నోకియా 220 ధర రూ. 3,249, నోకియా 235 ధర రూ. 3,749, నోకియా 3210 ధర రూ.3,999 గా ఉన్నాయి. అమెజాన్‌తో పాటు రిటైల్ షాపుల్లో కూడా ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి.