ఐ ఫోన్‌లలో ఔట్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్ తో హైరిస్క్
ఆ డివైజెస్ ను అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తున్న ఆపిల్ సంస్థ
యాపిల్ ఐ ఫోన్లు, మ్యాక్స్, యాపిల్ వాచీల్లో ఔట్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్ ను వాడుతూ ఉంటే హైరిస్క్ లో ఉన్నట్టేనని యాపిల్ సంస్థ హెచ్చరిస్తోంది. పాత సాఫ్ట్‌వేర్‌లోని సెక్యూరిటీ లోపాల కారణంగా ఆయా డివైజెస్‌లోకి గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా జొరబడి సెన్సిటివ్ డేటాను చోరీ చేయడం లేదా మానిప్యులేషన్ కు పాల్పడే అవకాశం ఉందని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తేల్చిచెప్తోంది. ఐవోఎస్ 18.1 కన్నా ముందు వర్షన్ లేదా 17.7.1 కల ఐఫోన్లు, 18.1 కంటే ముందు, 17.7.1 వర్షన్ కల ఐప్యాడ్ లు, పాత మ్యాక్ ఓఎస్ వాడుతున్న మ్యాక్ లు వాచ్ ఓఎస్ 11 కన్నా ముందు సాఫ్ట్‌వేర్ కల యాపిల్ వాచ్‌లకు ప్రమాదం ఉందని వెల్లడించింది. పాత టీవీ ఓఎస్, విజన్ ఓఎస్, సఫారీ బ్రౌజర్లకు ముప్పు తప్పదని హెచ్చరిస్తోంది. ఈ లోపాలకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా పరిష్కారం చూపిస్తున్నామని.. ఇంకా ఎవరైనా పాత సాఫ్ట్‌వేర్ వర్షన్‌లు వాడుతుంటే వారు వెంటనే తమ డివైజ్ లు అప్‌డేట్ చేసుకోవాలని యాపిల్ అలర్ట్ చేస్తోంది. ఒకవేళ అప్‌డేట్ చేసుకోకపోతే సైబర్ స్కామర్ల నుంచి రిస్క్ తప్పదని సెర్ట్ ఇన్, ఆపిల్ హెచ్చరిస్తున్నాయి.