ఐఫోన్ యూజర్లకు అలెర్ట్! వీటిని అప్‌డేట్ చేయాల్సిందే!
యాపిల్ ప్రొడక్ట్స్ వాడేవాళ్లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు సంబంధించిన ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్‌టీ)’ హై సివియారిటీ వార్నింగ్ ఇచ్చింది. యాపిల్ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన కొన్ని సాఫ్ట్‌వేర్లు సైబర్ హ్యాక్‌కు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించింది.
యాపిల్ ప్రొడక్ట్స్ వాడేవాళ్లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు సంబంధించిన ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్‌టీ)’ హై సివియారిటీ వార్నింగ్ ఇచ్చింది. యాపిల్ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన కొన్ని సాఫ్ట్‌వేర్లు సైబర్ హ్యాక్‌కు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించింది.
ఐఫోన్లతో పాటు మ్యాక్ డెస్క్‌టాప్, ఐ వాచ్, ఐపాడ్ వంటి యాపిల్ ప్రొడక్ట్స్‌లో కొన్ని సెక్యూరిటీ రిస్క్‌లు ఉన్నాయని సీఈఆర్‌టీ రిపోర్ట్ తెలిపింది. యాపిల్ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన కొన్ని సాఫ్ట్‌వేర్ వర్షన్లు సైబర్ దాడికి గురయ్యే అవకాశం ఉన్నట్టు సీఈఆర్‌టీ టీం గుర్తించింది. ఆయా సాఫ్ట్‌వేర్లలో ఉన్న లోపాల ఆధారంగా డివైజ్‌లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశముందని, యాపిల్ ఓఎస్‌కు చెందిన కొన్ని సాఫ్ట్‌వేర్స్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా కోరింది.
ఎఫెక్టెడ్ సాఫ్ట్‌వేర్‌లు ఇవే..
12.6 వెర్షన్ కంటే ముందు ఉన్న యాపిల్ ‘మ్యాక్ ఓఎస్ మాంటెరీ’ కంప్యూటర్లను 12.7కి అప్‌డేట్ చేసుకోవాలి.
‘మ్యాక్ ఓఎస్ వెంచురా’ వాడేవాళ్లు 13.6 వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి.
యాపిల్ వాచ్ ఓఎస్ 10 కంటే ముందు వెర్షన్‌లు వాడేవాళ్లు ‘వాచ్ ఓఎస్ 10.0.1’ కు అప్‌డేట్ అవ్వాలి.
ఐఫోన్, ఐప్యాడ్ లలో ఐఓఎస్ 16.7 కి ముందు వెర్షన్‌లు వాడుతున్నవాళ్లు ‘ఐఓఎస్ 17.0.1’ కి అప్‌డేట్ అవ్వాలి.
వీటితోపాటు యాపిల్ సఫారీ బ్రౌజర్16.6.1కి ముందు ఉన్న వెర్షన్‌లను కూడా అప్‌డేట్ చేయాలి.
అప్‌డేట్ చేయడం కోసం డివైజ్‌సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్ ఆప్షన్‌లో ‘సాఫ్ట్‌వేర్’పై క్లిక్ చేసి అప్‌డేట్స్‌ను డౌన్‌లోడ్ చేసి తర్వాత ఇన్‌స్టాల్ చేయాలి.
మ్యాక్ కంప్యూటర్లలో సిస్టమ్ ప్రిఫరెన్సెస్‌లోకి వెళ్లి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌దగ్గర ‘అప్‌డేట్ నౌ’ పై క్లిక్ చేయాలి.
యాపిల్ వాచ్ అప్‌డేట్ కోసం ఐఫోన్‌లో వాచ్ యాప్ ఓపెన్ చేసి జనరల్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆప్షన్ పై క్లిక్ చేసి అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి.