గూగుల్‌లో కొత్త ఇమేజ్ టూల్స్, ఎడిటింగ్ యాప్!
ఇంటర్నెట్‌లో ఏ విషయం గురించి సెర్చ్ చేయాలన్నా గూగుల్‌పైనే ఆధారపడుతుంటారు చాలామంది. అందుకే యూజర్ల అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు కొత్త టూల్స్‌ను అందుబాటులోకి తెస్తుంటుంది గూగుల్. తాజాగా.. ‘అబౌట్ దిస్ ఇమేజ్’ అనే టూల్, ‘యూట్యూబ్ క్రియేట్’ అనే యాప్‌ల గురించి ప్రకటించింది.
ఇంటర్నెట్లో ఏ విషయం గురించి సెర్చ్ చేయాలన్నా గూగుల్‌పైనే ఆధారపడుతుంటారు చాలామంది. అందుకే యూజర్ల అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు కొత్త టూల్స్‌ను అందుబాటులోకి తెస్తుంటుంది గూగుల్. తాజాగా.. ‘అబౌట్ దిస్ ఇమేజ్’ అనే టూల్, ‘యూట్యూబ్ క్రియేట్’ అనే యాప్‌ల గురించి ప్రకటించింది. ఇవెలా పనికొస్తాయంటే..
ఇంటర్నెట్లో ఏదైనా డేటా లేదా న్యూస్.. కరెక్టా? కాదా? అన్నది గూగుల్ ద్వారా తెలిసిపోతుంది. కానీ, ఇంటర్నెట్‌లో కనిపించే రకరకాల ఫోటోల గురించి నిజానిజాలు ఎవరికీ తెలియవు. వాటికోసం ఇతర యాప్స్ లేదా టూల్స్‌పై ఆధారపడాలి. అందుకే దానికోసం గూగుల్ ‘అబౌట్ దిస్ ఇమేజ్’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ టూల్ సాయంతో ఇంటర్నెట్‌లో కనిపించే ఇమేజ్ ఒరిజినల్ సోర్స్, కాంటెక్స్ట్, కంటెంట్ క్రెడిబిలిటీ వంటివి చెక్ చేయొచ్చు.
గూగుల్ ఇమేజెస్ రిజల్ట్స్‌లో ఇమేజ్ పైన కనిపించే త్రీ డాట్స్‌ను క్లిక్ చేస్తే ‘అబౌట్ దిస్ ఇమేజ్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా ఆ ఇమేజ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఆ ఇమేజ్ ఆరిజిన్ ఏంటి? ఎంత కాలం నాటిది? ఇమేజ్ మెటాడేటా, ఇమేజ్ పబ్లిషర్ ఎవరు? అది కెమెరాతో క్లిక్ చేసినదా? లేదా ఏఐతో క్రియేట్ చేసిందా? అనే వివరాలు తెలుస్తాయి.
ఇకదీంతోపాటు ఫ్యాక్ట్ చెకింగ్ కోసం ‘ఫేస్ చెక్ క్లెయిమ్ సెర్చ్’ అనే మరో టూల్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ టూల్ ద్వారా ఇమేజ్ కచ్చితత్వాన్ని మరిం స్పష్టంగా తెలుసుకోవచ్చు.
ఇకపోతే యూట్యూబ్ క్రియేటర్స్ కోసం గూగుల్.. ‘యూట్యూబ్ క్రియేట్’ అనే కొత్త ఎడిటింగ్ యాప్ రిలీజ్ చేయనుంది. ఎవరైనా సులభంగా వీడియోలను క్రియేట్, ఎడిట్ చేసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌తో యూజర్లు ఉచితంగానే షార్ట్ వీడియోలు, ఫుల్ వీడియోలు ఎడిట్ చేసుకోవచ్చు.
ప్రెసిషన్ ఎడిటింగ్, ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ క్యాప్షనింగ్, వాయిస్ ఓవర్, ట్రాన్సిషన్స్, బీట్ మ్యాచింగ్ వంటి ఎడిటింగ్ ఫీచర్లు ఇందులో ఉంటాయి. ప్రస్తుతం ఈ యాప్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది యూజర్లందరికీ అందుబాటులో వస్తుంది.