గూగుల్ కొత్త ఏఐ టూల్.. జెమినీ! ప్రత్యేకతలివే..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తనదైన ప్రత్యేకతను చాటేందుకు గూగుల్ కూడా రెడీ అవుతుంది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తనదైన ప్రత్యేకతను చాటేందుకు గూగుల్ కూడా రెడీ అవుతుంది. ఓపెన్ ఎఐకు పోటీగా ‘జెమినీ ఏఐ’ పేరుతో ఓ సరికొత్త ఏఐ టూల్‌ను డెవలప్ చేస్తోంది గూగుల్. త్వరలోనే దీన్ని అఫీషియల్‌గా లాంఛ్ చేయనున్నారు. జెమినీ ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్ జీపీటీ, డాల్–ఇ వంటి ఏఐ టూల్స్‌కు పోటీగా జెమినీ ఉండబోతోంది. ఇది కూడా ఇమేజ్, వీడియో, టెక్స్ట్ బేస్డ్ డేటా ఫార్మాట్స్‌ను ప్రాసెస్ చేయగలుగుతుంది. చాట్ జీపీటీ మోడల్ కంటే మెరుగ్గా ఇది డేటాను యాక్సెస్ చేస్తుందని, మరింత ఎక్కువ ప్రొడక్టివిటీ చూపిస్తుందని గూగుల్ చెప్తోంది.
చాట్ జీపీటీ తరహాలో గూగుల్.. ఇప్పటికే ‘బార్డ్’ అనే ఏఐ సైట్‌ను క్రియేట్ చేసింది. అయితే జెమినీ అంతకుమించి ఉండబోతోంది. ఇందులో కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా మల్టీ మోడల్ ఏఐ టూల్స్ అందుబాటులో ఉంటాయి. ఇది వెబ్‌లో మాత్రమే కాకుండా మల్టిపుల్ డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది. గూగుల్ పిక్సెల్ ఫోన్లలో కూడా ఇది ఇన్‌బిల్ట్ టెక్నాలజీగా ఉండనుంది.
మెమరీ, సెక్యూరిటీ, క్రియేటివిటీ, ప్లానింగ్.. ఇలా అన్ని రంగాల్లో దీన్ని ట్రెయిన్ చేసిన తర్వాత వివిధ ప్రొడక్టులు, అప్లికేషన్స్, ఇతర డివైజ్‌ల్లోకి అందుబాటులోకి తెస్తారు. జెమినీ టూల్‌ను సంస్థలు సెక్యూరిటీ సిస్టమ్స్ కోసం వాడుకోవచ్చు. వ్యక్తుల తమ అవసరాలన్నింటినీ జెమినీకి చెప్పి దాన్ని పర్సనల్ అసిస్టెంట్‌గా మార్చుకోవచ్చు. ఇలా పలు రకాలుగా ఈ ఏఐ పనిచేయనుంది. ఈ టూల్‌ను పిక్సెల్ యూజర్లు తమ ఫోన్లలో యాక్సెస్ చేసుకోవచ్చు. జెమినీలో అల్ట్రా, ప్రో, నానో అనే మూడు మోడల్స్ రానున్నాయి. ఒక్కో మోడల్‌ను ఒక్కో పర్పస్ కోసం డిజైన్ చేశారు. టెక్ వర్గాల సమాచారం ప్రకారం 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో జెమినీ లాంచ్ అవ్వనున్నట్టు తెలుస్తోంది.