Telugu Global
Science and Technology

గూగుల్ వ్యాలెట్ వ‌చ్చేసింది.. మీ కార్డులు, టికెట్ల‌న్నీ సేఫ్‌గా స్టోర్ చేసుకోవ‌చ్చు

భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ప్రైవేట్ డిజిటల్ వ్యాలెట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. దీనిలో మీ డెబిట్‌, క్రెడిట్ కార్డులు, టికెట్లు, లాయ‌ల్టీ పాయింట్లు, గిఫ్ట్ కార్డులు, ఐడీలు అన్నింటినీ భద్రంగా స్టోర్ చేసుకోవచ్చు.

గూగుల్ వ్యాలెట్ వ‌చ్చేసింది.. మీ కార్డులు, టికెట్ల‌న్నీ సేఫ్‌గా స్టోర్ చేసుకోవ‌చ్చు
X

భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ప్రైవేట్ డిజిటల్ వ్యాలెట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. దీనిలో మీ డెబిట్‌, క్రెడిట్ కార్డులు, టికెట్లు, లాయ‌ల్టీ పాయింట్లు, గిఫ్ట్ కార్డులు, ఐడీలు అన్నింటినీ భద్రంగా స్టోర్ చేసుకోవచ్చు. ఇది గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. ప్రధానంగా లావాదేవీలయేతర అవసరాల కోసమే వ్యాలెట్‌ను రూపొందించామ‌ని గూగుల్ తెలిపింది.

ఎలా వాడుకోవ‌చ్చు?

* చెల్లింపు కార్డుల‌ను అంటే డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌ను గూగుల్ వ్యాలెట్‌కు సింక్ చేసుకోవ‌చ్చు. ఈ వ్యాలెట్ ద్వారా గూగుల్‌ పే పనిచేసే ఎక్కడైనా ఆఫ్ లైన్‌లో చెల్లించ‌వ‌చ్చు.

* ఫోన్‌లోనే మెట్రో కార్డ్‌, విమాన టిక్కెట్లు, బస్ పాస్‌లు సేవ్ చేసుకోవ‌చ్చు. గూగుల్ సెర్చ్ నుంచి అందిన సమాచారంతో ప్రయాణ సమయాల్లో మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

* గూగుల్ మ్యాప్స్‌లో నేరుగా ట్రాన్సిట్ కార్డ్ బ్యాలెన్స్ కూడా లోడ్ చేసుకోవ‌చ్చు.

* క్రెడిట్ కార్డులు వాడ‌టం వ‌ల్ల వ‌చ్చే లాయల్టీ పాయింట్లు, గిఫ్ట్ కార్డ్‌లను కూడా గూగుల్ వ్యాలెట్‌కు సింక్ చేసుకోవచ్చు. దీనివ‌ల్ల అవి ఎక్స్‌పైర్ అయిపోక‌ముందే ఆ డేట్‌ను ఎప్పటికప్పుడు రిమైండ్ చేస్తుంది.

* క్రికెట్ మ్యాచ్‌, సినిమా, ఎంట‌ర్‌టైన్‌మెంట్ షో టికెట్‌ల‌ను కూడా ఈ వ్యాలెట్‌కు యాడ్ చేసుకోవ‌చ్చు. ఆ షో ఎన్నింటికి, ఏ రోజుఅనేది వ్యాలెట్టే మీకు రిమైండ‌ర్స్‌, అల‌ర్ట్స్ పంపిస్తుంది.

100% సేఫ్

గూగుల్ వ్యాలెట్‌లో స్టోర్ చేసే మీ కార్డుల వివ‌రాలు, ఇత‌ర స‌మాచార‌మంతా సురక్షితంగా ఉంటుందని గూగుల్ ప్ర‌క‌టించింది. దీనికి టూ స్టెప్ వెరిఫికేషన్, ఫైండ్ మై ఫోన్‌, రిమెట్ డేటా ఎరేజ్ వంటి ఫీచర్ల‌న్నీ ఉంటాయి. కార్డు నంబర్ ఎవ‌రికంటా ప‌డ‌కుండా ఎన్‌క్రిప్టెడ్ పేమెంట్ కోడ్ వంటి గూగుల్ సేఫ్టీ ఫీచ‌ర్లు కూడా ఈ గూగుల్ వ్యాలెట్‌లో ఉంటాయి.

First Published:  8 May 2024 6:53 PM IST
Next Story