Telugu Global
Science and Technology

ఈ ఏడాది బెస్ట్ యాప్స్ ఇవే..

Google best apps 2022: గూగుల్ మోస్ట్ పాపులర్ యాప్స్‌లో ఈ ఏడాది విడుదలైన యాప్స్‌తో పాటు కొన్ని పాత గేమింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. ఈ లిస్ట్‌లో షాప్సీ, క్వెస్ట్, క్యాల్, బేబీజీ, లూడో కింగ్ యాప్స్ టాప్‌లో ఉన్నాయి.

ఈ ఏడాది బెస్ట్ యాప్స్ ఇవే..
X

ఏడాది ముగుస్తున్న సందర్భంగా.. ఈ ఏడాదికి గానూ బెస్ట్ యాప్స్‌ను ప్రకటించింది గూగుల్‌. ఇండియాలో ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్‌ అప్లికేషన్స్ ఏంటంటే..

గూగుల్ మోస్ట్ పాపులర్ యాప్స్‌లో ఈ ఏడాది విడుదలైన యాప్స్‌తో పాటు కొన్ని పాత గేమింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. ఈ లిస్ట్‌లో షాప్సీ, క్వెస్ట్, క్యాల్, బేబీజీ, లూడో కింగ్ యాప్స్ టాప్‌లో ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన షాప్సీ (Shopsy) ఈ ఏడాది ఎక్కువ ఆదరణ పొందిన యాప్‌గా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఈ యాప్‌ ద్వారా ఎలాంటి కమీషన్ చెల్లించకుండా తమ ప్రొడక్ట్స్ ను సోషల్‌ మీడియా అకౌంట్స్ ద్వారా అమ్ముకోవచ్చు. రోజువారీ అవసరాలు తీర్చే యాప్‌గా ఇది ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.

స్టూడెంట్స్ కోసం రూపొందించిన క్వెస్ట్‌ (Questt) యాప్ కూడా పాపులర్ యాప్స్‌ లిస్ట్‌లో ముందుంది. ఈ యాప్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యార్థుల అవసరాలను తెలుసుకుని, దానికి అనుగుణంగా మెటీరియల్, ప్రాక్టీస్ సెషన్స్‌ను అందిస్తుంది.

మంచి కోసం ఉపయోగపడే యాప్స్‌లో క్యాల్(Khyaal) అనే యాప్ బెస్ట్‌గా నిలిచింది. ఇది సీనియర్‌ సిటిజన్ల కోసం ఉద్దేశించిన యాప్. ఇది వృద్ధులకు ప్రీపెయిడ్‌ కార్డులు అందిస్తుంది. అలాగే వారికి సంబంధించిన ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందజేస్తుంది.

బెస్ట్‌ హిడెన్‌ జెమ్స్‌ కేటగిరిలో బేబీజీ (BabyG) అనే యాప్‌ టాప్ ప్లేస్‌లో ఉంది. పిల్లల ఎదుగుదలకు తోడ్పడే ఈ యాప్.. పిల్లల యాక్టివిటీలను ట్రాక్ చేయడంలో సాయపడుతుంది. పిల్లలకు కావాల్సిన స్టోరీలు, యాక్టివిటీలు ఇందులో ఉంటాయి. పిల్లల యాక్టివిటీస్‌ను పేరెంట్స్ ట్రాక్ చేసే సౌకర్యం కూడా ఈ యాప్ కల్పిస్తుంది.

ఇక వీటితో పాటు పాపులర్ ఆన్‌గోయింగ్‌ యాప్స్ విభాగంలో లూడోకింగ్‌ ముందుంది. వీటితో పాటు పలు గేమింగ్, యుటిలిటీ యాప్‌లు కూడా పాపులర్ యాప్స్‌గా గుర్తింపు పొందాయి.

First Published:  9 Dec 2022 4:13 PM IST
Next Story