Telugu Global
Science and Technology

గూగుల్ హెల్త్ కనెక్ట్ యాప్! ఎలా పనిచేస్తుందంటే..

Google Health Connect App: గూగుల్ లేటెస్ట్‌గా ‘హెల్త్ కనెక్ట్’ అనే కొత్త యాప్‌ను విడుదల చేసింది. హెల్త్, ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టేవాళ్లకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గూగుల్ చెప్తోంది.

గూగుల్ హెల్త్ కనెక్ట్ యాప్! ఎలా పనిచేస్తుందంటే..
X

గూగుల్ హెల్త్ కనెక్ట్ యాప్! ఎలా పనిచేస్తుందంటే..

గూగుల్ లేటెస్ట్‌గా 'హెల్త్ కనెక్ట్' అనే కొత్త యాప్‌ను విడుదల చేసింది. హెల్త్, ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టేవాళ్లకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గూగుల్ చెప్తోంది. ఇదెలా పనిచేస్తుందంటే..

ఫిట్‌నెస్ కోరుకునేవాళ్లు రకరకాల యాప్‌ల ద్వారా యాక్టివిటీస్‌ను ట్రాక్ చేస్తుంటారు. డైట్ టిప్స్ లాంటివి ఫాలో అవుతుంటారు. అయితే అన్నిరకాల ఫిట్‌నెస్ టిప్స్‌ను ఒకే యాప్‌లో పొందేందుకు వీలుగా గూగుల్‌ కొత్త యాప్ ను డెవలప్ చేసింది. దీనిద్వారా రకరకాల ఫిట్‌నెస్, హెల్త్‌, వెల్‌బీంగ్‌ యాప్‌లను ఒకేచోట కనెక్ట్ చేసుకోవచ్చు. గూగుల్‌ హెల్త్‌ కనెక్ట్‌ ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.

మొబైల్ సంస్థ శాంసంగ్ సహకారంతో గూగుల్‌ హెల్త్‌ కనెక్ట్‌ యాప్‌ను రూపొందించింది. హెల్త్‌ కనెక్ట్‌ యాప్ ను వాడే యూజర్లు స్మార్ట్ వాచ్, మొబైల్, ట్యాబ్లెట్.. ఇలా రకరకాల ఆండ్రాయిడ్‌ డివైజెస్, ఆండ్రాయిడ్ యాప్స్‌లో నమోదైన ఫిట్‌నెస్ డేటాను యాక్సెస్ చేయొచ్చు. అలాగే షేర్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం మైఫిట్‌నెస్‌పాల్‌, ఆరా, పెలోటాన్‌, శాంసంగ్ హెల్త్‌, ఫిట్‌బిట్‌ వంటి పదికి పైగా హెల్త్, ఫిట్‌నెస్, వెల్‌బీయింగ్‌ యాప్‌లు గూగుల్ హెల్త్ కనెక్ట్ ప్లాట్‌ఫాంతో లింక్ అయ్యాయి. త్వరలో మరిన్ని హెల్త్ యాప్స్‌ను లింక్ చేస్తామని గూగూల్ చెప్తోంది.

First Published:  17 Nov 2022 10:00 AM IST
Next Story